మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 250 కోట్లు కలెక్షన్లు దాటి సాధించింది. విడుదలై రెండు వారాలు దాటుతున్న ధియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో అంటూ ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాలో రాముడిగా, హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారు దానికి ప్రశాంత్ వర్మ ఒక ఆన్సర్ ఇచ్చారు. అన్ని కుదిరితే హనుమంతుడిగా చిరంజీవి రాముడిగా మహేష్ బాబు ఉండాలని అనుకుంటునట్లు డైరెక్టర్ చెప్పారు. ఇప్పటికే హనుమాన్ సినిమాలో హనుమంతుని కళ్ళు చిరంజీవిని పోలివున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత మెగాస్టార్ ని ఇంకా కలవలేదని ఒకవేళ కలిస్తే ఆ ప్రపోజల్ ఆయనకు చెబుతామని అన్నాడు. ఇక రాముడిగా మహేష్ బాబు ఫోటోలు డిజైన్ చేసుకుని తమ ఆఫీసులో పెట్టుకున్నామని కూడా తెలిపారు. ఒకవేళ ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్లు మహేష్ చిరంజీవి ఈ పాత్రలు చేయడానికి ఒప్పుకుంటే బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా తిరగ రాస్తుంది.
1st Choices of @PrasanthVarma for #JaiHanuman. @KChiruTweets as #Hanuman @urstrulyMahesh as #ShriRam
(Lord Ram will Probably be an Extended Cameo only) pic.twitter.com/0LFlo1L85M
— 𝔻𝕖𝕖𝕡𝕒𝕜 (@KodelaDeepak) January 30, 2024
Also read: ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫేస్ ని చూపించకపోవడానికి కారణం ఇదేనా..?









1. ప్రేమ పెళ్లి:
2. పెద్దలు కుదిర్చిన పెళ్లి:
ప్రేమించి వివాహం చేసుకున్నా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా కూడా ఆ బంధం అనేది నిలబడాలంటే అది ఆ భార్యా భర్తల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, ప్రేమానురాగాలు పెళ్లి నిలబడడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది వీడియో చూడండి..
ధోనీ తన ఆటతో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినప్పటికీ, ధోనీ ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ధోనీకి సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ధోనీకి స్వంత అన్న ఉన్నాడని, అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ధోని తన అన్నను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతని గురించి ధోని బయోపిక్ గా వచ్చిన ‘ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ’ లో కూడా చూపించలేదని అంటున్నారు.
ధోనికి ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు నరేంద్ర సింగ్ ధోని. ధోనీ కన్నా పదేళ్ళు పెద్దవాడు. కొంతకాలం క్రితం ధోని రాంచిలో ఉన్న తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం ధోనిని నరేంద్ర కలిశాడని ది క్రిక్టైమ్ తెలిపింది. నెటిజెన్లు చేస్తున్న కామెంట్స్ కు నరేంద్ర సింగ్ ధోని గతంలో ఒక ఇంటర్వ్యూతో ధోనీ ఫ్యాన్స్ జవాబు ఇస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో నరేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, ‘మహీ చిన్నతనం, యువకుడిగా కష్టాలు పడ్డ టైమ్ లో నేను ధోనీకి సాయం చేయలేదు. అతను క్రికెటర్ గా ఎదగడంలో నా ప్రమేయం ఏం లేదు. మహీ నాకన్నా పది సంవత్సరాలు చిన్నవాడు. తను తొలిసారి బ్యాట్ పట్టుకునే టైమ్ కి రాంచి విడిచి ఉన్నత చదువుల కోసం కుమాన్ యూనివర్సిటీకి వెళ్ళాను. కానీ మహీకి కొన్నింటిలో నైతికంగా అండగా ఉన్నా, వాటన్నిటినీ మూవీలో ఇరికించాల్సిన పని లేదు. నిజానికి ఈ మూవీ మహీ గురించి, అతడి ఫ్యామిలీ గురించి కాదు’’ అని చెప్పుకొచ్చారు.
నరేంద్ర సింగ్ ధోనికి పాలిటిక్స్ అంటే ఆసక్తి అని తెలుస్తోంది. అతను 2013 నుండి సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగుతున్నాడు. దానికి ముందుగా బిజెపిలో ఉండేవారని సమాచారం. నరేంద్ర 2007లో వివాహం చేసుకోగా, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు నేషనల్ మీడియా కథనాలు తెలుపుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అంజు(34), పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం అయ్యింది. వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు సాగిన తరువాత ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అంజు,భర్త పిల్లలను విడిచి పెట్టి, ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు కూడా దాటి, జూలై 21న పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్‌లో ఉండే దీర్ సిటీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో అంజు భర్త అయిన అరవింద్ మాట్లాడుతూ, తన భార్య అంజు జైపూర్‌కు వెళ్తున్నాననే వంకతో గురువారం నాడు ఇంటి నుండి వెళ్లినట్టు వెల్లడించారు. అయితే అంజు పాకిస్థాన్‌కు వెళ్లినట్టుగా తెలిసిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె స్నేహితుడిని కలవాలని తెలిపి, ఇంటి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ఆమె భర్తకి ఫోన్ చేసి, ఆమె లాహోర్‌లో ఉన్నానని, 2, 3 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని అంజు చెప్పినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.