ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తుంది తక్కువ బడ్జెట్లో సినిమా తీసినప్పటికీ సరైన కంటెంట్ ఉండడం వలన బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ఈ సినిమాలు. ఉదాహరణగా మొన్న తెలుగులో వచ్చిన సినిమా హనుమాన్ అయితే గత జూన్ లో మరాఠీ భాషలో వచ్చిన సినిమా బైపన్ భారీ దేవ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మరాఠీలో అత్యధిక వసూళ్లు చేసిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 90 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. థియేటర్స్ లో పెద్దగా ఆదరణ లభించని చిత్రాలకి సైతం ఓటీటీ లో ఊహించని ఆదరణ లభిస్తుంది. అలాంటిది రికార్డు క్రియేట్ చేసిన సినిమా ఓటీటీ లో అది కూడా ఒకటి కాదు ఏకంగా రెండు ఓటీటీ ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఇక్కడ ఎలాంటి సునామి సృష్టిస్తుందో చూడాలి. బైపన్ భారీ దేవ అంటే కఠినమైన స్త్రీత్వం అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, వందన గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పానవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపాపరాబ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి కేదార్ షిండే దర్శకత్వం వహించారు అలాగే జీ స్టూడియోస్, ఎంవిబి మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఆరుగురు అక్కచెల్లెళ్లకు సంబంధించిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా మరొకటి హులు యాప్ లో అందుబాటులో ఉంది హాట్‌స్టార్ లో మరాఠీ తో పాటు హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మరొక ఓటీటీ ఫుల్ యాప్ లో కేవలం అమెరికా లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక తెలుగువారు ఈ సినిమాని చూడాలనుకుంటే సబ్ టైటిల్స్ లో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది.

సానియా మీర్జాకి షోయబ్ మాలిక్‌తో పెళ్లి జరగక ముందు, ఆమె తన ఫ్రెండ్ సోహ్రాబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సానియా హైదరాబాద్ లో ప్రముఖ బేకరీ అయిన యూనివరల్ బేకర్స్ ఓనర్ సోహ్రబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జులై 2009లో ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు సైతం మార్చుకున్నారు.
సానియా, సోహ్రబ్ హైదరాబాద్ లో సెయింట్ మేరీస్ కాలేజీలో కలిశారు. సానియా చదువుకునే రోజుల్లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ కాలేజీలో సోహ్రబ్ కామర్స్ చదివాడు. అనంతరం యూకేలో ఎంబీఏ పూర్తిచేసి, బిజినెస్ లోకి వచ్చారట. అయితే, వీరి వివాహానికి కొన్నిరోజుల ముందు సానియా, షోయబ్ మాలిక్‌తో ప్రేమించడంతో సోహ్రాబ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
ఆ తరువాత సానియా పెద్దలను ఒప్పించి షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. ఇక వీరు విడాకులు తీసుకున్న వార్త వైరల్ అవడంతో నెటిజెన్లు సోహ్రాబ్ మీర్జాను పెళ్లి చేసుకొని ఉంటే సానియా లైఫ్ ఇలా అయ్యేది కాదని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోహ్రాబ్‌తో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నా, వారి ఫ్యామిలీలు ఇప్పటికీ కూడా సన్నిహితంగానే ఉన్నాయి.
రివ్యూ :
పలు హాలీవుడ్ సినిమాలలో చూసిన కాన్సెప్ట్‌లకు దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌లు, సూపర్ పవర్స్, యుఎఫ్ఓలు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్, పవర్ఫుల్ రోబోలు, ఫెమ్ ఫేటేల్స్ అయాలాన్ని అన్ని వయసుల వారికి వినోదాన్ని పంచుతుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు.
ఇక నటీనటుల విహాయనికి వస్తే, శివ కార్తికేయన్ తమీజ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ తరువాత స్థానం టట్టూదే. కొన్ని సన్నివేశాలలో టట్టూకి శివకార్తికేయన్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్,కరుణాకరన్, యోగిబాబు వారి పాత్రల మేరకు నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్ బాగా నటించారు.
మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి అంటే నిహారిక కొణిదెల మాత్రమే. మెగా డాటర్ నటిగా కెరీర్ మొదలుపెట్టక ముందు బుల్లితెర పై వ్యాఖ్యాతగా చేశారు. ఈటీవీలో ప్రసారమైన ఢీ జూనియర్ 1 మరియు ఢీ జూనియర్ 2 విభాగాలకు, ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోను హోస్ట్ చేసింది. ఆ తరువాత పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆమె ‘ఒక మనసు’ అనే మూవీతో 2016 లో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి జరిగిన తరువాత సినిమాలకు దూరంగా ఉండగా, ప్రస్తుతం మళ్ళీ సినిమాలపై దృష్టి సారించారు. తెలుగులో ‘వాట్ ది ఫిష్’ తో పాటు తమిళంలో కూడా సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘వర్క్ తో బిజీగా ఉన్నాను. తమిళంలో ఒక మూవీ చేస్తున్నా. ప్రొడక్షన్ చేస్తున్నా. ఐదేళ్ల తరువాత మళ్ళీ సినిమాలో నటిస్తున్న, సూర్యకాంతం మూవీ తరువాత ఏ మూవీ చేయలేదు.
గ్యాప్ రావడానికి కారణం పెళ్లి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే సినిమాలలో నటించదేమో అని అనుకుంటారు. సినిమాలు ఎందుకు ఆపాలి? మా వదిన లావణ్యను కూడా ఇలాగే అడిగారు. సినిమాలు చేయడం మానేస్తారా? అని. పెళ్లి జరిగితే సినిమాలు చేయడం ఆపేయాలా? మూవీకి, పర్సనల్ లైఫ్‌కి ఉన్న సంబంధం ఏమిటి? ఐదేళ్ల తరువాత తిరిగి సినిమాలలో నటించడం సంతోషంగా ఉంది” అని అన్నారు.






తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇక మరి ఆ ఫోటో గురించి చూసేద్దాం. ఈ ఫోటో లో ఒక పక్కన చిరంజీవి మరొక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటుగా తెల్ల చొక్కా వేసుకుని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఒకసారి ఫోటోని చూసి కనుక్కోండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు స్టార్ రైటర్ గా వెలుగొందిన దేవి శ్రీ ప్రసాద్ తండ్రి. దేవిశ్రీప్రసాద్ గురించి పరిచయం చేయక్కర్లేదు టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు.




