“అంజి” సినిమాకి ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా.? చిరుతో ఎందుకు చేయాల్సి వచ్చింది.?

“అంజి” సినిమాకి ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా.? చిరుతో ఎందుకు చేయాల్సి వచ్చింది.?

by Mounika Singaluri

Ads

కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో 2004 లో విడుదలైన అంజి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి గ్రాఫిక్స్ అప్పటివరకు తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా చూశాం. సినిమా కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

Video Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటన, మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. కోడి రామకృష్ణ గారు చిరంజీవి కమర్షియల్ స్టార్ కాబట్టి తన దగ్గర ఒక డబుల్ రోల్ హీరో పాత్ర ఉన్న స్టోరీ ఉంది అని, చిరంజీవితో ఆ సినిమా చేద్దామని అన్నారట. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాత్రం గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమానే చేద్దాం అని అన్నారు. ఈ విషయంపై చిరంజీవిని సంప్రదించి ఈ సినిమా కోసం తను ఒక కొత్త నటుడిలాగా కష్టపడాలి అని అన్నారట కోడి రామకృష్ణ గారు.

అందుకు చిరంజీవి పర్వాలేదు అని, అంతే కష్టపడతాను అని అన్నారట. దాంతో కోడి రామకృష్ణ గారు సోషియో ఫాంటసీ అయిన అంజి కథని సిద్ధం చేశారు. మూవీ షూటింగ్ కి చాలా సమయం పట్టింది. ఆ మూవీ షూటింగ్ టైంలో చిరంజీవి ఇంకా కొన్ని సినిమాలు కూడా చేశారట. కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే రెండు సంవత్సరాలు పట్టింది.

ఇది ఇలా ఉంటె… డైరెక్టర్ ముందుగా ఈ సినిమాని హీరో వెంకటేష్ తో చేయాలి అనుకున్నారు అంట. కానీ చిరంజీవి ఓకే చెప్పడంతో వెంకీ దేవీపుత్రుడు కథని ఓకే చేసారు. అంజి షూటింగ్ దేవిపుత్రుడు కంటే ముందే మొదలైనా లేట్ అవ్వడంతో 2004 లో విడుదలైంది. దేవిపుత్రుడు సినిమా 2001 లోనే విడుదలైంది.


End of Article

You may also like