ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాటలలో వారి పక్కన స్టెప్స్ వేసే సైడ్ డాన్సర్లకు కూడా ఎక్కువగా గుర్తింపు లభిస్తోంది. అలా వారికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా ద్వారానే అని చెప్పవచ్చు.
ఆ మధ్యన వచ్చిన వారసుడు సినిమాలోని రంజితమే సాంగ్ లో విజయ్, రష్మికలతో పాటు సైడ్ డాన్సర్ హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సాంగ్స్ లో ఎక్కువగా కనిపించే డాన్సర్ విఘ్నేష్ రాజేంద్రన్ గురించి ఇప్పుడు చూద్దాం..డాన్సర్ విఘ్నేష్ రాజేంద్రన్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. అతను తెలుగులో అనేక పాటలలో సైడ్ డాన్సర్ గా చేశాడు. అలా విఘ్నేష్ టాలీవుడ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని , విజయ్ దేవరకొండ వంటి వారితో పని చేశాడు.
అయితే అతను తమిళ ఇండస్ట్రీకి చెందిన డాన్సర్. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకి డాన్సర్ గా చేస్తాడు. విఘ్నేష్ రాజేంద్రన్ కోలీవుడ్ కొరియోగ్రాఫర్ దినేష్ టీమ్ మెంబర్. దినేష్ మాస్టర్ దళపతి విజయ్, అజిత్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో ఆయన టీమ్ మెంబర్ గా ఉన్న విఘ్నేష్ ఆ హీరోల సాంగ్స్ లో గ్రూప్ డాన్సర్ గా పనిచేశాడు.విఘ్నేష్ కొరియోగ్రాఫర్ నేర్పించే డ్యాన్స్ స్టెప్పులను తేలికగా నేర్చుకుంటాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో విఘ్నేష్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతని ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపు 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా అతనికో ఫ్యాన్ పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ కి 1536 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం అతను డాన్సర్ గా కొనసాగుతూనే, యాక్టర్ గా కూడా మారినట్టు తెలుస్తోంది.
Also Read: “క్షణం కూడా నిన్ను మర్చిపోలేను..!” అంటూ… “తారకరత్న” భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!