పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రిపబ్లిక్ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇందులో పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. అందులోనూ ముఖ్యంగా థియేటర్ల విషయం గురించి చర్చించారు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు స్పందించారు. నాని, కార్తికేయ వంటి నటులు థియేటర్ల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు.
అయితే, ఈ విషయంపై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా స్పందించారు. “మీరు ఆడవాళ్ళని గౌరవిస్తారు కదా? మన ఇండస్ట్రీకి వచ్చి ఒక ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన ఒక హీరోయిన్ కి కూడా మీరు న్యాయం చేయాలి” అంటూ మాట్లాడారు. ఇండస్ట్రీ లో జరిగే ఆడవాళ్ళ సమస్యలపై కూడా స్పందించాలి అనే ఉద్దేశంతో పోసాని కృష్ణమురళి మాట్లాడారు.
watch video :