డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఓం భీమ్ బుష్
- నటీనటులు : శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, ఆదిత్య మీనన్.
- నిర్మాత : సునీల్ బలుసు
- దర్శకత్వం : శ్రీ హర్ష కొనుగంటి
- సంగీతం : సన్నీ ఎం.ఆర్.
- విడుదల తేదీ : మార్చి 22, 2024
స్టోరీ :
క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ అలియాస్ మ్యాడీ రేలంగి (రాహుల్ రామకృష్ణ) చాలా మంచి స్నేహితులు. వీళ్ళ ముగ్గురు పీహెచ్డీ చేయడానికి లెగసీ యూనివర్సిటీలో చేరుతారు. వీళ్ళని బ్యాంగ్ బ్రదర్స్ అని అంటారు. 5 సంవత్సరాలు అయినా సరే వీళ్ళ పీహెచ్డీ పూర్తి అవ్వదు. వీళ్ళు చేసే పనులు తట్టుకోలేక కాలేజ్ ప్రిన్సిపాల్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) వీళ్ళకి డాక్టరేట్లు ఇచ్చి పంపిస్తాడు. తిరిగి ఊరికి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరూ భైరవపురం అనే ఒక గ్రామానికి వెళ్తారు.
అక్కడ మంత్రాలు, తంత్రాలు అని చెప్పి, టెక్నాలజీని ఉపయోగించి, ఆ ఊరి ప్రజల దగ్గర నుండి కొన్ని డబ్బులు వసూలు చేయాలి అని అనుకొని ఏ టు జెడ్ సర్వీసెస్ పేరుతో ఒక వ్యాపారం తెరుస్తారు. వీళ్ళని బ్యాంగ్ బ్రోస్ అని పరిచయం చేసుకుంటారు. కానీ తర్వాత వీళ్ళ బండారం అంతా బయట పడిపోతుంది. వాళ్లు సైంటిస్టులు కాదు అనే విషయం ఊరి వారికి తెలిసిపోతుంది. దాంతో ఊరి చివరన ఉన్న సంపంగి మహల్ అనే మహల్ లోకి వెళ్లి, అక్కడ నిధి కనిపెట్టి తీసుకురావాలి అని ఆ ఊరి సర్పంచ్ (ఆదిత్య మీనన్) ఆదేశం ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళ ముగ్గురు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ లో నిధి ఉందా? అక్కడ దెయ్యం ఉందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి గతంలో బ్రోచేవారెవరురా సినిమాలో నటించారు. ఈ సినిమా కామెడీ అనే విషయం మీద సాగుతూనే, మరొక పక్క ఒక సెన్సిటివ్ విషయం గురించి కూడా చూపించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా మాత్రం కామెడీ మీద మాత్రమే సాగుతుంది. ఎక్కువ శాతం సినిమాలో కామెడీ ఉండేలాగా చూసుకున్నారు. కొన్ని జోక్స్ వర్కౌట్ అయ్యాయి. కొన్ని జోక్స్ మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. చాలా సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి. కానీ సినిమా ఉద్దేశం కూడా అదే. నటీనటులు ఎదుర్కొన్న సంఘటనల వల్ల జనరేట్ అయిన కామెడీతో సినిమా అంతా కూడా నడిపించారు.
ఇది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. కామెడీ పేరుతో సపరేట్ గా ఒక ట్రాక్ పెట్టడం కానీ, లేదా కామెడీ పేరుతో పిచ్చి పిచ్చి సీన్స్ రాయడం కానీ చేయలేదు. సినిమా మొత్తంలో వాళ్ళు ఎదుర్కొనే సంఘటనల వల్ల కామెడీ వస్తుంది. అందుకే కామెడీ సహజంగా అనిపిస్తుంది. కష్టపడి నవ్వించే ప్రయత్నం చేయలేదు. సినిమా కోసం రాసుకునే కథలోనే కామెడీ ఉండేలాగా చూసుకున్నారు. కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి.
ఇలాంటి సినిమాల్లో నటీనటులు ఎంత బాగా నటిస్తే సీన్స్ అంత బాగా కనిపిస్తాయి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వారి పాత్రల్లో చాలా బాగా నటించారు. ఏమీ తెలియకపోయినా కూడా అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇచ్చే పాత్రల్లో వీరి నటన నవ్వు తెప్పిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నీ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం స్లోగా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఈ విషయాల్లో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- ఎంచుకున్న కాన్సెప్ట్
- నటీనటుల పర్ఫార్మెన్స్
- కామెడీ సీన్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- స్లోగా సాగి కొన్ని సీన్స్
- హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
లాజిక్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి, అలాంటివి లేకపోయినా పర్లేదు, మంచి కథ ఉంటే చాలు, హాయిగా ఒక మూడు గంటల పాటు నవ్వుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చూస్తే మాత్రం ఓం భీమ్ బుష్ సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : RAZAKAR COLLECTIONS: 50 కోట్లు పెట్టి తీస్తే…ఈ సినిమా 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?