IPL 2024:రేపటి నుండే ఐపీఎల్ స్టార్ట్…CSK వైస్ RCB ఓపెనింగ్ మ్యాచ్ లో సందడి చేయబోయే 4 సెలబ్రిటీస్ వీరే.

IPL 2024:రేపటి నుండే ఐపీఎల్ స్టార్ట్…CSK వైస్ RCB ఓపెనింగ్ మ్యాచ్ లో సందడి చేయబోయే 4 సెలబ్రిటీస్ వీరే.

by Mohana Priya

Ads

ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుండి ఐపీఎల్ 17 సీజన్ ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. చెన్నైలో చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టారు. ఈ సారి కూడా ఎంతో ఘనంగా ప్రారంభ వేడుకని నిర్వహించాలి అని బీసీసీఐ బృందం నిర్ణయించుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మరొక హీరో టైగర్ ష్రాఫ్ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.

Video Advertisement

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ కూడా ఇందులో పాలుపంచుకోబోతున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది సెలబ్రిటీస్ ఈ ఐపీఎల్ మొదటి మ్యాచ్ కి హాజరు అవుతారు. గత సంవత్సరం కూడా ఐపీఎల్ ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా జరుగుతుంది అని ఆశిస్తున్నారు. శుక్రవారం రోజు సాయంత్రం 6:30 నిమిషాలకి ఐపీఎల్ మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఐపీఎల్ ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇంక ఐపీఎల్ మ్యాచ్ విషయానికి, వస్తే ఇవన్నీ కూడా జియో సినిమా యాప్ లో ఉచితంగా స్ట్రీమ్ అవుతాయి. అందరూ ఐపీఎల్ మ్యాచ్ లని ఉచితంగానే చూడవచ్చు.

ipl 2024 event performance stars

ఐపీఎల్ ఈవెంట్ 6 గంటల 30 నిమిషాలకి ప్రారంభం అయితే, మ్యాచ్ మాత్రం 8 గంటలకి ప్రారంభం అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఆడడం ఇది తొమ్మిదవ సారి. గతంలో 2009, 2011, 2012, 2018, 2019, 2022, 2023 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఆడింది. 17 రోజుల్లో 2 డబుల్ హెడర్లతో 21 మ్యాచ్ లు జరిగేలాగా ప్లాన్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఉండడం మొదటి దశ షెడ్యూల్ ని ప్రకటించారు. మిగతా షెడ్యూల్ కూడా తర్వాత ప్రకటిస్తాము అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ఇంక ఈ ఐపీఎల్ మ్యాచ్ ల కోసం భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. ఈసారి కప్ గెలిచేది ఏ జట్టు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ALSO READ : చాలా సినిమాలని సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే… సాయి పల్లవికే హీరో నో చెప్పాడంట.? ఎవరంటే.?


End of Article

You may also like