వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఎంతో మంది నటీనటులు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా అడుగు పెడుతున్నారు. ఇటీవల అలా బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా అడుగు పెట్టారు. ఇప్పుడు 30 వెడ్స్ 21 లో హీరోగా నటించిన చైతన్య రావు అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : అన్నపూర్ణ ఫోటో స్టూడియో
- నటీనటులు : చైతన్య రావు, లావణ్య, మిహిర.
- నిర్మాత : యష్ రంగినేని
- దర్శకత్వం : చందు ముద్దు
- సంగీతం : ప్రిన్స్ హెన్రీ
- విడుదల తేదీ : జూలై 21, 2023.
స్టోరీ :
కథ విషయానికి వస్తే ఈ సినిమా గోదావరి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో మొదలవుతుంది. అక్కడ ఉండే చంటి (చైతన్య రావు) ఆత్మహత్య చేసుకోబోతాడు. అది చూసిన పోలీసులు అతని ఆస్పత్రిలో చేరుస్తారు. చనిపోయే ముందు చంటి ఒక సూసైడ్ నోట్ రాస్తాడు. అది పోలీసులు చదువుతూ ఉంటారు. ఇంక చంటి విషయానికి వస్తే చదువుకొని, తన తల్లి పేరుతో అన్నపూర్ణ ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు.
తన చెల్లిని చేర్చిన కాలేజ్ లో చదివే గౌతమి (లావణ్య) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే అనుకోకుండా ఒక హత్య కేసులో చంటి ఇరుక్కుంటాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి చంటిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. తర్వాత చంటి ఏం చేశాడు? ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు? అతని ప్రేమ కథ ఏమయ్యింది? చంటి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలకి డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఇలాంటి కథలని ప్రేక్షకులు ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు. అలాగే వాటిని ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. సినిమా అంతా కూడా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. ఇంక కథ విషయానికి వస్తే ఇలాంటి కథలు మనం అంతకుముందు చాలా చూశాం.
దాంతో చూస్తున్నంత సేపు పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. కానీ అలా వెళ్ళిపోతుంది అంతే. సినిమా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్లకి మధ్య వచ్చే సీన్స్ లో కామెడీ ఉండేలాగా దర్శకుడు చూసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం సీరియస్ గా సాగుతుంది. ఇంక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వారే. వారిద్దరికీ నటన ఏమి కొత్త కాదు.
కానీ ఇద్దరికీ హీరో హీరోయిన్లుగా మొదటి సినిమా కావడంతో వారి పెయిరింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ చాలా సహజంగా చేశారు. కామెడీ కొన్ని చోట్ల అలా వెళ్ళిపోయినా కూడా, కొన్ని చోట్ల మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో కొన్ని కామెడీ సీన్స్ లో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే 1980 నేపథ్యంలో కథ సాగుతుంది అని రాసుకోవడం కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. కానీ కొన్ని కామెడీ సీన్స్ లో, కథనంలో జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- సినిమాకి ఎంచుకున్న బ్యాక్ డ్రాప్
- పాటలు
- నటీనటుల పర్ఫార్మెన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- కొన్ని కామెడీ సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా సరదాగా సాగిపోయే ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఇటీవల రిలీజ్ అయిన ఈ 6 హీరోల పోస్టర్స్ లో… ఎక్కువ మందికి నచ్చిన 2 పోస్టర్స్ ఇవేనా..?