2023 సంవత్సరం దాదాపు చివరి దశకు వచ్చేసింది. అయితే ఈ సంవత్సరం తెలుగులో వందల కొద్ది సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సినిమాల ద్వారా సక్సెస్ పొందిన హీరోయిన్ల లిస్టు ఒక్కసారి పరిశీలిస్తే… తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండా బాలీవుడ్ సినిమా యానిమల్ తో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ఈ అమ్మడు చేసిన చిన్న పాత్ర అయినా సరే తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇక నెక్స్ట్ మాట్లాడాల్సి వస్తే.. కెరీర్ ముగిసిపోయింది అనుకున్నా తర్వాత మళ్లీ పుంజుకున్న హీరోయిన్ శృతిహాసన్. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చింది. మొన్న వచ్చిన హాయ్ నాన్న చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు సలార్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే శృతిహాసన్ కి మళ్ళీ తిరుగు ఉండదు. శృతిహాసన్ తర్వాత ఆ రేంజ్ లో సక్సెస్ దక్కించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. సార్, విరుపాక్ష సినిమాలతో అమ్మడికి మంచి హిట్లు పడ్డాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమా చేసింది. ఈ సినిమా విడుదల హిట్ అయితే అమ్మడు హాట్ ట్రిక్ కొట్టినట్లే.
సీనియర్ హీరోయిన్ అనుష్క కూడా ఈ ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ కొట్టింది. వీరు కాక సింగల్ సినిమాలతో హిట్లు కొట్టిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య, సామజ వరగమన సినిమాతో మౌనిక రెబా జాన్, దసరా సినిమాతో కీర్తి సురేష్, హాయ్ నాన్న చిత్రంతో మృణల్ లు మంచి హిట్లు పడ్డాయి. మిగతా హీరోయిన్లకు చెప్పుకునే సినిమాలు లేవు. 2024 లో అయినా అందరికీ కలిసి వస్తుందేమో చూడాలి.


1976లో జన్మించిన కల్వకుంట్ల తారక రామారావు యూఎస్ లో ఎంబీఏ చేశారు. ఆ తరువాత అమెరికాలో కొన్నేళ్ల పాటు జాబ్ చేశారు. 2006లో తన జాబ్ కి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో చేరి తన తండ్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. జూన్ 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, 2003లో డిసెంబర్ 18న కేటీఆర్, శైలిమల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే పిల్లలు ఉన్నారు. సోమవారం నాడు వీరి పెళ్లిరోజు సందర్భంగా, 20 సంవత్సరాల క్రితం నాటి పెళ్లి ఫొటోను, భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, “నా అందమైన భార్య శైలిమకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు మరియు నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
మన ప్రయాణం ఇలాగే మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నాను.” అంటూ తన భార్య శైలిమకు పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కేటీఆర్ పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే ఈ ట్వీట్ కు నెటిజెనల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్ట్ కి రిప్లైగా కేటీఆర్ పెళ్లి ఫోటోలతో వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.









