ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ అవార్డులలో పుష్ప చిత్రానికిలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్ర సీమలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. తెలుగు ఇండస్ట్రీకి ఉత్తమ జాతీయ నటుడి అవార్డు లేదని లోటు అలాగే ఉండిపోయింది.
కానీ ఇప్పుడు ఆ లోటును అల్లు అర్జున్ తీర్చారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును తీసుకున్నారు. అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ తో పాటు ఇండియాలోని అన్ని రంగాల వారు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు.

తాను నటిస్తున్న పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అయితే ఏకంగా జాతీయ అవార్డులు పొందిన వారి కోసం పార్టీని ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేశారు. జాతీయ అవార్డు తన పైన మరింత బాధ్యత పెంచిందని అల్లు అర్జున్ ప్రకటించారు.ఇది ఇలా ఉంటే చాలామందికి తెలియని మరొక విషయం కూడా ఉంది నిజానికి అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోక ముందే అతని ఇంట్లో వారి పేరు జాతీయ అవార్డులు ఉన్నాయి.

అల్లు అర్జున్ తాత అయిన అల్లు రామలింగయ్య కమెడియన్ గా భారతదేశం అంతా తెలుసు. అల్లు కుటుంబీకులు ఆయన గుర్తుగా ఆయన పేరు మీదనే ఎందరో ప్రతిభావంతులకు జాతీయ అవార్డులను అందిస్తున్నారు.అల్లు రామలింగయ్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తెలుగు ఆయన స్మారకార్థం ఈ జాతీయ అవార్డును నెలకొల్పింది. ప్రతి సంవత్సరం ఈ అవార్డును తెలుగు చలనచిత్ర ప్రముఖులకు ఇచ్చి సత్కరిస్తున్నారు.

ఇక అల్లు రామలింగయ్యకు ఇద్దరు పిల్లలు. కుమార్తె సురేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి వివాహం చేయగా కుమారుడు అల్లు అర్జున్ నిర్మాతగా గీత స్థాపించి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఇలా అల్లు కుటుంబంలోనే జాతీయ అవార్డులు ఉండటం అల్లు అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.
Also Read:“సుహాసిని” నుండి… “నయనతార” వరకు… “డైరెక్టర్స్”ని పెళ్లి చేసుకున్న 9 మంది హీరోయిన్లు..!

20 ఏళ్ల నుండి న్యూజిలాండ్ చేతిలో ప్రపంచ కప్ సిరీస్ లో భారత్ ఓడిపోతూనే ఉంది. న్యూజిలాండ్ ను ఓడించాలి అనేది భారత్ టీం తో పాటు యావత్తు భారత అభిమానులకు చిరకాల కల. అది ఆదివారం నెరవేరింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ టీం ఒక దశలో చాలా బాగా బ్యాటింగ్ చేసింది. భారత్ బౌలర్లకు వికెట్లు తీయడం కష్టంగా మారింది. కానీ భారత్ బౌలర్లు తమ బౌలింగ్ తీరును మార్చుకుని వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టారు.
స్టార్ బౌలర్ షమి అయితే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించగా, జడేజా కోహ్లీకి సహకారం అందించి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.దాంతో ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరగనీ జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్ టీమిండియా తో ఓటమి తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.భారత జట్టు అధికారికంగా టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న కూడా ఇంకా సెమిస్ కి ప్రవేశించలేదు.
సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే ఒక జట్టు కనీసం ఆరు విజయాలు సాధించాలి. రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లోనూ విజయం సాధించింది కాబట్టి మరో మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. టీమిండియా కు ఇంకా నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్కటి గెలిచిన సరిపోతుంది.భారత్ కు సెమీస్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు భారత్, న్యూజిలాండ్ సెమీస్ కి అర్హత సాధించడం ఖాయమే. వీరితోపాటు మిగతా రెండు జట్లు ఏవి సెమీఫైనల్ కి చేరతాయి అనేది వేచి చూడాలి. 































