హీరో లేదా విలన్ జైలుకు వెళ్ళడం వంటి సన్నివేశాలను చాలా సినిమాలలో చూపించడం జరిగింది. ఈ క్రమంలో జైలు లోపల ఎలా ఉంటుందో, వారిని కలవడానికి వచ్చేవారిని, ఖైదీలు ఉండే జైలు గదులు కూడా పలు సినిమాలలో కనిపిస్తాయి.
ఖైదీల జీవన విధానం, వారు చేసి పనులను మరియు వారు భోజనం కోసం వరుసలో నిలబడి ఉండడం వంటి సన్నివేశాలను కూడా కొన్ని చిత్రాలలో అందరూ చూసే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జైళ్ళలో ఉండే ఖైదీలకు ఎలాంటి ఆహారం ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
భారతీయ జైళ్ళలో ఎలాంటి ఆహారం ఇస్తారనే విషయాన్ని కోరాలో అడగగా, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జైలులో ఎలాంటి ఆహారం పెడతారనే విషయం గురించి వివరించారు. అదే విధంగా ఒక వ్యక్తి తెలంగాణలో చంచల్ గూడ జైలులో ఎలాంటి ఆహారం పెడతారో గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ జైలులో “అల్పాహారంగా ప్రతి రోజు, ఉదయం 6:30 గంటలకు పులిహోరను వడ్డిస్తారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, కూరగాయలు లేని నీళ్ల సాంబారు. రోజూ ఒక్కో రకం కూర. దాదాపు 11:30 కి పెట్టారు. రాత్రి భోజనంలో రసంతో తాజాగా వండిన అన్నం, మధ్యాహ్న భోజనంలో మిగిలిన సాంబార్. దీర్ఘకాలం ఉండే ఖైదీలకు దాదాపు సాయంత్రం 5:00 గంటలకు ఒక గుడ్డు. ఆదివారం నాడు 200 గ్రాముల మటన్ లేదా కోడి కూర. కూర తూకం వేయబడుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి సమానంగా లభిస్తుంది. ఎటువంటి గొడవలు జరగవు, కూర చాలా బాగుంది. పోలీసులు మాతో కలిసి భోజనం చేస్తారు. శాఖాహారులకు ఆదివారం ప్రత్యేక కూర ఇస్తారని ఒకరు వివరించారు.
తెలంగాణ చంచల్‌గూడ జైలు లో “అల్పాహారం ప్రతిరోజూ ఉదయం 7:00 గంటలకు చపాతీ, ఉప్మా మొదలైనవి చాలా పరిమిత పరిమాణంలో అందించబడతాయి. టీ కూడా ఇస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనంలో అన్నం మరియు కూర సమృద్ధిగా లభిస్తాయి. జైలు క్యాంటీన్ లో ఊరగాయలు కొని, అన్నం తినడానికి, మధ్యాహ్న భోజనంతో కొన్ని స్నాక్స్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు మళ్లీ కూరతో అన్నం సరిపడినంత లభిస్తుందని” ఒక యూజర్ వివరించారు.
Also Read: నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?

ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు కొన్నేళ్ళ నుండి ఫలితాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఆయన సినిమాలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ లియో అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇటీవల కాలంలో ఏ తమిళ సినిమాకి లేనంత హైప్ లియో సినిమా పై నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఈ మూవీ తెలుగు సినిమా కాపీ అని చర్చ జరుగుతోంది. ఆ తెలుగు మూవీ ఏమిటంటే 2010లో వచ్చిన గాయం 2. రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని సమర్పించగా, ప్రవీణ్ శ్రీ డైరెక్షన్ లో తెరకెక్కింది.
గాయం 2 మూవీని హాలీవుడ్ సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్’ ఆధారంగా తీశారు. కట్ చేస్తే, లియో ట్రైలర్ కి గాయం 2కి పోలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ హిల్ స్టేషన్ లో హోటల్ రన్ చేయడం, భయపడుతూ బ్రతకడం, ప్రత్యర్థులు వచ్చి అటాక్ చేస్తే తప్పించుకోవడం, ఆఖరికి ఎదురు తిరగడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. ఆ సీన్స్ ని, గాయం 2 సీన్స్ ను పోలుస్తూ రెండింటి వీడియోస్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండున్నర నిముషాల నిడివి గల ట్రైలర్ లో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతుర్లుగా కనిపించారు. బాలయ్య పక్కా తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విలన్ కు సవాలు విసిరే సీన్స్ లో, బిడ్డ శ్రీలీల గురించి తల్లడిల్లిపోయే సన్నివేశాలలో బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వైపు సోషల్ మీడియాలో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా రొటీన్ గా ఉందని, పాత సినిమాలలోని మ్యూజిక్ నే కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చారని కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో అర్జున్ రాంపాల్ ను విలన్ గా సెలెక్ట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆరంభంలోనే వరుసగా ముగ్గురు పరుగులు ఏమి చేయకుండానే అవుట్ అయ్యారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి 85 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 97 నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన రాహుల్, మూడు పరుగుల తేడాతో శతకాన్ని చేసే ఛాన్స్ ను కోల్పోయాడు.
విన్నింగ్ షాట్ తరువాత ఒక్కసారిగా రాహుల్ కింద కూర్చున్నాడు. ఫోర్ వెళ్తుందనుకున్న షాట్, సిక్స్ వెళ్లడంతో తనలో తానే నవ్వుకున్నాడు. అదే సమయంలో రాహుల్ ఫేస్ లో సెంచరీ కోల్పోయాను అనే బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ తరువాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునే సందర్భంగా రాహుల్ సెంచరీ మిస్ అవడం పై మాట్లాడుతూ, నిజానికి సెంచరీ తన ప్రణాళికలో ఉందని, సెంచరీని పూర్తి ఎలా చేయాలనేది ఆలోచించాను.
ముందు బౌండరీ, ఆ తరువాత సిక్సర్‌తో సెంచరీ సాధ్యపడుతుందని భావించానని, అయితే మొదటిదే సిక్సర్‌గా వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కావడానికి కారణం హార్దిక్ పాండ్యా అని నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ సిక్స్ కొట్టకకుండా ఉంటే రాహుల్ సులభంగా సెంచరీ చేసేవాడని కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యా మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు తిలక్ వర్మ విషయంలో కూడా ఇలానే చేశాడని, ఐపీఎల్లో ఇలాంటివి చాలాసార్లు చేశాడని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – “ఈ రోజు మధురపూడి గ్రామం అనే నేను థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నా సొంత మనిషి. హైదరాబాద్‌కి, ఇండస్ట్రీకి వచ్చిన క్రొత్తలో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్పట్లో నాకు మోరల్ సపోర్ట్‌గా ఉండేవారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్లో ఫస్ట్ కథ ఇచ్చిన శ్రీహరి గారి భద్రాద్రి సినిమాకు మల్లి గారే దర్శకులు. అప్పటి నుండి ఇప్పటి దాకా మా రిలేషన్ అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు. మధుర పూడి గ్రామం అనే నేను ట్రైలర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్గా ఉంటూనే ఎమోషన్స్‌తో నిండి ఉంది. మరో గొప్ప విషయం ఏంటంటే మణిశర్మగారు సంగీతం అందించారు. అలాగే మా అందరికీ గురు సమానులు గౌతమ్ రాజు గారు ఎడిటర్‌గా చేశారు. ట్రైలర్లో హీరో శివ కంఠమనేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. అలాగే హీరోయిన్ క్యాథలిన్ గౌడ, మిగతా ఆర్టిస్టులు చక్కగా చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

టాలీవుడ్ లో ఇప్పటివరకు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యువతను ఫిదా చేశాయి. అలాంటి సినిమానే మ్యాడ్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంది. కాలేజీలో గ్యాంగ్స్, సీనియర్లు, జూనియర్లు, ర్యాగింగ్, గొడవలు. ప్రేమలు వంటివాటిని ట్రైలర్ చూపించారు.
నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నటించిన ముగ్గురి హీరోలలో డీడీగా నటించిన యాక్టర్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని టాక్. మూవీ చూసిన ఆడియెన్స్ సైతం అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూయర్స్ సైతం ఆ కుర్రాడి స్టైల్, కామిడి టైమింగ్, డైలాగ్ డెలివరీ ని మెచ్చుకుంటున్నారు.
ఆ నటుడి పేరు సంగీత్ శోభన్. అతను ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి మంచి కామెడీ హీరో లభించాడు అనుకునేలా నటించాడు. సంగీత్ శోభన్ మరేవరో కాదు యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు మరియు దివంగత డైరెక్టర్ శోభన్ రెండవ కుమారుడు. అన్నయ్య సంతోష్ హీరోగా సీరిస్, సినిమాలలో నటిస్తుంటే, తమ్ముడు సంగీత్ కామెడీ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడు.
కలర్స్ స్వాతి యాంకర్, హీరోయిన్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో స్వాతి వికాస్ అనే వ్యక్తిని ఆగస్టు పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైజాగ్ లో నివసించే మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) తన గవర్నమెంట్ జాబ్ ను పోగొట్టుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. అయితే మధుసూధన్ తన భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిస అవుతాడు. ఇది ఇలా ఉంటే, యూఎస్ లో సెటిల్ అయిన మధుమతి(శ్రియ నవిలే) అనే అమ్మాయి బంధువుల ఇంట్లో వివాహానికి వైజాగ్ వస్తుంది.
అయితే ఒక సందర్భంలో మధుమతికి మధుసూధన్ తో పరిచయం అవుతుంది. ఒకసారి మాటల సందర్భంలో మధుసూధన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? లేఖ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది? ఆఖరికి లేఖ మధుసూదన్ కలిశారా? అనేది మిగిలిన కథ. మంత్ ఆఫ్ మధు సినిమా అనేది అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చిన మధుమతి నెల రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలే ఈ మూవీ.
“అఖండ” బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మరో మాస్ ఎంటర్ టైనర్ స్కంద. బోయపాటి శ్రీను మూవీ అంటే తప్పకుండా మాస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఊహకు అందని రీతిలో బోయపాటి తన చిత్రాలలో ఫిక్షన్‌ను జోడిస్తారు. కానీ, స్కంద మూవీలో అది అతి అయ్యిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
రొటీన్ స్టోరీని కూడా విపరీతమైన వయొలెన్స్‌తో చూపించారని, మూవీలో పెద్దగా ఏమీ లేదని నెటిజెన్లతో పాటు విమర్శకులు కూడా అంటున్నారని టాక్. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేసినట్టు తెలుస్తోంది. ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు.
తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. శ్రీలీలా రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది. ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.




