రాబిన్ హుడ్ పై ఇప్పటికే కథలు, సినిమాలు, సిరీస్ లు ఎన్నో వచ్చాయి. ధనికుల డబ్బుని దోచుకొని,పేదవారికి పంచి పెట్టె ఒక దొంగనే రాబిన్ హుడ్. హాలీవుడ్ చిత్రాలతో రాబిన్ హుడ్ పేరు ఎంతగానో పాపులర్ అయింది. ఇక అలాంటి స్టోరీనే త్వరలో తెలుగులో రాబోతుంది. అదే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. అయితే ఇది హాలీవుడ్ రాబిన్ వుడ్ కథ కాదు. ఆంధ్రా రాబిన్ వుడ్ గా పేరు గాంచిన గరిక నాగేశ్వరరావు కథ.
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాస్తవ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల దగ్గరలో ఉండే స్టువర్టు పురం దొంగ గరిక నాగేశ్వరరావు జీవితం కథే టైగర్ నాగేశ్వరరావు సినిమా. గరిక నాగేశ్వరరావు ఆకక్డి వారు టైగర్ అని కొందరు, మరికొందరు ఆంధ్ర రాబిన్ హుడ్ అని పిలుస్తుంటారు. అప్పట్లో నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లోనూ దొంగతనాలు చేయడంలో బాగా పేరూ పొందాడు.
ఆయన మీద ఎన్నో దొంగతనాలు, ఇతర నేరాల్లో కేసులు ఉండేవి. ఇప్పుడు అలాంటి వ్యక్తి పేరుతో సినిమా రూపొందడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో బయోపిక్ అన్నప్పటి నుండి అతని పై చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరి ఆంధ్రా రాబిన్ హుడ్? అతనికి ఆ పేరు ఎలా వచ్చింది. గరిక నాగేశ్వరరావు ఎలా టైగర్ నాగేశ్వరరావుగా మారారు అనేది ఇప్పుడు చూద్దాం.
ముగ్గురు అన్నదమ్ముల కథ:
కొంపల్లే సుందర్ అనే పరిశోధకుడు టైగర్ నాగేశ్వరరావు జీవితం పై పరిశోధన చేశారు. అయితే ఈ పరిశోధనలో ఎన్నో ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. టైగర్ నాగేశ్వరరావు గా పాపులర్ అయిన వ్యక్తి నిజమైన పేరు గరిక నాగేశ్వరరావు. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. నాగేశ్వరరావుకు అన్నయ్య పేరు ప్రభాకర్, ఆయన తమ్ముడు పేరు ప్రసాద్ ఉన్నారు. వీరిది స్టువర్టుపురం. ఈ అన్నదమ్ములు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారి చుట్టూ ఉన్నవారు తమని పట్టించుకోలేదని, కనీసం మనుషులుగా కూడా చూడలేదనే కారణంతో వీరు దొంగతనాలను మొదలు పెట్టారు.
వారిని మనిషులుగా గుర్తించక పోవడం వల్ల నేర జీవితాన్ని ఎంచుకొని వారు బాటలో కొనసాగారు. అప్పటి ఉమ్మడి ఏపీతో పాటు ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఈ ముఠా భారీ దొంగతనాలకు చేసేవారు. దాంతో ఆ రాష్ట్రాల్లో ఈ ముగ్గురిపై తీవ్రమైన నేరారోపణలు, అనేక దొంగతనాలు చేసిన కేసులు కూడా నమోదు చేశారు. ఈ దొంగతనాలలో 1973లో బనగానపల్లిలో జరిగిన దొంగతనం అప్పట్లో సంచలనం అయ్యింది.
మార్పు తీసుకువచ్చే ప్రయత్నం:
అప్పటికే వీరు స్టువర్టుపురం దొంగలుగా పాపులర్ అయ్యారు. అయితే వీరిలో మార్పు తీసుకురావడానికి నాస్తిక సొసైటీకి చెందిన హేమలత మరియు ఆమె భర్త లవణం ఎంతగానో ప్రయత్నించారు. ఈ భార్యాభర్తలు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో వారిలో కొద్దిగా మార్పు కనిపించింది. అలా వారు పరివర్తన చెందినప్పటికీ కొన్ని కారణాలతో మళ్లీ దొంగతనాలు వైపుకే నాగేశ్వరరావు ముఠా వెళ్ళింది.
పోలీసుల కాల్పుల్లో మరణం:
దొంగతనాలు కేసులలో మరియు తీవ్రమైన నేరాలలో నిందితులుగా ఉన్న ఈ ముఠా కోసం పెద్ద ఎత్తున పోలీసులు గాలించేవారు. అలా గాలించే క్రమంలో 1980లో జరిగిన పోలీసుల కాల్పుల్లో టైగర్ నాగేశ్వరరావు చనిపోయాడు. మరణించే సమయానికి టైగర్ నాగేశ్వరరావు వయసు 27 సంవత్సరాలు మాత్రమే. అయితే అతనిలో పరివర్తన వచ్చిన అనంతరం మళ్ళీ దొంగతనాలు చేయకుండా ఉంటే అతను మరణించేవాడు కాదని పరిశోధకుడు సుందర్ వెల్లడించారు.
ఎన్నో సార్లు టైగర్ నాగేశ్వరరావు మీద కాల్పులు జరిగినా ఆయన తప్పించుకొని బయటపడ్డారని సుందర్ తెలిపారు. ప్రభుత్వం వీరిలో మార్పు తీసుకురావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే కాల్పులు జరిపేలా చర్యలు తీసుకుందని ఆయన తన పరిశోదనలో వెల్లడించారు.
టైగర్ నాగేశ్వరరావు సమాధి – ఆర్చ్:
స్టువర్టుపురం ప్రాంతంలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సమాధి మరియు వీరిలో మార్పుకు ప్రయత్నించిన హేమలత, ఆమె భర్త లవణంపేరుతో ఉన్న ఆర్చ్ కూడా కనిపిస్తుంది. అయితే ఒకానొక సమయంలో నాగేశ్వరరావు ముఠా హేమలత, లవణం జంటను తమ తల్లిదండ్రులుగా కూడా భావించిందంట. వారు చెప్పిన మాటలు వింటూ వారు చెప్పిన పనులు మాత్రమే చేస్తూ మార్పు వైపుకు అడుగులు వేసినవారు.
మళ్లీ దొంగతనం వైపుకి వెళ్లడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారని సుందర్ తెలిపారు. ప్రస్తుతం స్టువర్టుపురంలో దొంగతనాలకు స్థానం లేదని, ఇక్కడ ఉండే యువత విద్యాధికులు అవడంతో పరిస్థితులన్ని పూర్తిగా మారాయి. ఇక్కడి యువత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండడంతో నేరాలు పూర్తిగా తగ్గాయి.ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఊపేసిన స్టువర్టుపురం దొంగల కథ.
ఇక నాగేశ్వరరావు అన్న ప్రభాకర్ రావు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు.ప్రభాకర్ రావు తమ్ముడి గురించి చెబుతూ ఆయనకు టైగర్ అనే పేరును తమిళనాడు వాళ్లు పెట్టారని, అది అలాగే స్థిరపడిపోయిందని ఆయన తెలిపారు. తన తమ్ముడు కన్నా తనే ముందు దొంగగా మారాను అని, అప్పటికే 2 ఎకరాల భూమి కొనుక్కున్నట్లు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు, ప్రభాకర్ రావు తమిళనాడులో కూడా దొంగతనాలకు చేసేవారు.
టైగర్ నాగేశ్వరరావు పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఎలాంటి అంశాల్ని చూపించబోతున్నారో అని స్టువర్టుపురం ప్రజల నుండి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఆ సినిమా వాళ్లు నాతో మాట్లాడి, నాగేశ్వరరావు గురించిన వివరాలు తెలుసుకున్నారు. అయితే సినిమాలో వారి అవసరం కోసం లేనివాటిని కొన్నింటిని చూపించే అవకాశం కూడా ఉంటుంది. జరిగిన దానిని వక్రీకరించకూడదని అని ప్రభాకర్ రావు తెలిపారు.
శారద అనే మహిళ మాట్లాడుతూ, మేం చదువుకునే సమయంలో స్టువర్టుపురం అనగనే మమ్మల్ని భిన్నంగా, తప్పుగా చూసేవారు. ఆ విధానం ఇప్పుడిప్పుడే మెల్లగా తగ్గుతోంది. మా గ్రామంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్ద చదువులు అభ్యసించి చాలా మంది మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అప్పటి స్టువర్టుపురం కథ చెప్పి, నేటి తరం జీవితాల మీద ఆనాటి మచ్చ పడకుడదని, మా పిల్లలను అందరూ అనుమానించే స్థితి రాకూడదని అన్నారు. శారద ప్రస్తుతం చెన్నైలో ఐటీ రంగంలో చేస్తున్నానని, ఇలాంటి చిత్రాల వల్ల అపోహలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
Also Read: 2014 లో ”కీరవాణి” ఆ తప్పు చేసి ఉంటే… ఈరోజు ఆస్కార్ వచ్చేదే కాదు…!

















తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.
అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా
1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు.
2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.
3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.
డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.
అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి,ఏం చేయాలి అనే దానిపై సమీరా ఫ్యాన్స్ కి సలహాలు కూడా ఇచ్చారు. వీక్లీ 4 సార్లు యోగా, బ్యాడ్మింటన్ చేయడంతో పాటు,అప్పడప్పుడు ఉపవాసం చేస్తూ బరువు తగ్గనని తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను, తర్వాత సన్నగా అయిన ఫోటోను షేర్ చేసి ఎంతోమందికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. ఇక సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ అనుభవాల్ని వెల్లడిస్తానని ముందే ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన సమీరా, ఆ తరువాత ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ కాబోయే తల్లులకు ధైర్యాన్ని ఇస్తూ ఆదర్శంగా నిలుస్తునాన్నారు.
అంతేకాకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల అందం చెడిపోతుందని రకరకాలుగా బయట సమాజం మాట్లాడుకుంటుంది. అలా అనుకోవడం సరికాదని చెబుతోంది. గోవాలో ఉంటున్న ఆమె రోజువారీ విశేషాలు, ఆరోగ్య చిట్కాలు, వంటలు వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తున్నారు. ఇక ఈ నేచురల్ బ్యూటీ అంటూ సమీరారెడ్డి మేకప్ లేకుండా పెట్టిన డీగ్లామరస్ ఫోటోలు ఒకవైపు వైరల్ అవుతుంటే,మరోవైపు వాటికి ట్రోల్స్ కూడా వస్తున్నాయి.అయిన ట్రోల్స్ అన్నిటికీ సమీరా ధీటుగా కౌంటర్లు ఇస్తుంటారు.
స్పైడర్ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా విలన్ గా భైరవుడు అనే క్యారెక్టర్ లో ఎస్.జె సూర్య అద్భుతంగా నటించారు.
ఈ అబ్బాయి పేరు సంజయ్. శ్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత అతన్ని ‘స్పైడర్ సంజయ్’ అని పిలుస్తున్నారు. ఈ మూవీ తరువాత సంజయ్ పలు తమిళ సినిమాలలో నటించాడు. మాగముని, జాక్ పాట్, గజినీకాంత్, ఎచ్చరిక్కై తుగ్లక్, దర్బార్ వంటి సినిమాలలో నటించాడు.
సంజయ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ పేరు కుట్టి టాకీస్. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫుడ్ రివ్యూలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోను సంజయ్ యాక్టివ్ గా ఉంటాడు. పాపులర్ సాంగ్స్ కు డాన్స్ చేసిన వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు.