Sita Ramam: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ సీతారామం. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా ముఖ్య పాత్రలో నటించింది. తాజాగా సీతారామం సినిమా టెలివిజన్ లో ప్రసారం అయ్యి, 9.6 రేటింగ్ సాధించింది.
సీతారామం మూవీ థియేటర్లలో విజయం సాధించి, ఓటీటీలోనూ విజయవంతంగా దూసుకుపోతుంది. దుల్కర్ సల్మాన్ తనదైన శైలిలో నటిస్తూ, రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు. తాజాగా దుల్కర్ ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. హృద్యమైన ప్రేమకావ్యంగా రూపొందిన ఈ సినిమా సినీ ప్రియుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్‌ల నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమైన పాత్రలోఅక్కినేని సుమంత్, రష్మికల నటనకు మంచి మార్కులు వచ్చాయి.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. విశాల్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు. యుద్ధంతో రాసిన ప్రేమకథగా, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటుగా సిని ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇటీవల ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 9.6 టిఆర్పి వచ్చింది. ఈమధ్య కాలంలో విడుదలై, హిట్ అందుకున్న పలు మూవీస్ కంటే కూడా ఇది ఎక్కువ.
వెండితెర పై సూపర్ హిట్ అయిన సీతారామం ఇటు టెలివిజన్ ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇక్కడ కూడా సత్తా చూపించింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ 51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెట్టిన పెట్టుబడి తేవడమే కాకుండా 30 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా రూ.80 కోట్ల క్లబ్లో చేరింది.

ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్‌కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు, తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్‌లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.
వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్‌ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.
హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్‌గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.
కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.
ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.
జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.
ఇక ఏలిన నాటి శని ప్రభావం ఎవరి జాతకంలో ఉంటుందో, వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ శనీశ్వరుడి అనుగ్రహం ఉన్న వాళ్ళకు అన్ని కలిసి వస్తాయి. కుంభరాశిలో శని సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శనీశ్వరుడు అనుగ్రహంతో సంవత్సరం పొడవునా వారు చేసే పనులకు ఆటంకాలు ఉండవు. వారు పట్టుకున్నవన్ని బంగారమే అని చెప్తున్నారు. 2023లో కుంభరాశిలో శనిప్రవేశంతో తులారాశి, మిథునరాశి పై శని ప్రభావం పోతుంది. అంతేకాకుండా ధనుస్సు రాశి వారు ఏలిన నాటి శని నుండి విముక్తి పొందుతారు. ఇక 2023లో ఏ రాశుల పై శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందో చూద్దాం..
మిథున రాశి: 2023లో శని సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. రాబోయే సంవత్సరంలో వీరు అదృష్టవంతులు అవడమే కాకుండా, ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది.ఆగిన పనులన్నీ ఈ ఏడాది పూర్తవుతాయి. నూతన ఆదాయ మార్గాలు కలుగుతాయి. వీరు ఏ పనులు మొదలుపెట్టిన కూడా ఆర్ధిక ప్రయోజనాలు ఇస్తాయి.
రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.
మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్‌లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.