‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్’ ఈ డైలాగ్ మనకు పరిచయమయ్యి నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకుంది మాత్రం బద్రి చిత్రంతోనే.పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం బద్రి.పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే.ఏప్రిల్ 20 2000 సంవత్సరంలో బద్రి చిత్రం ‘విజయలక్ష్మి మూవీస్ బ్యానర్’ పై టి త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదల అయ్యింది.

పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ , పూరి డైలాగ్స్ ,రమణ గోగుల బాణీలు ఈ చిత్రానికి మేజర్ హైలైట్స్ అని చెప్పాలి .అయితే ఈ చిత్రం వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి.ఈ చిత్రంతోనే పవన్ – రేణు దేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి ,ప్రేమగా మారి అది కాస్తా పెళ్లి వరకు వెళ్లడం జరిగింది ..

అంతే కాదు.. ఈ చిత్రంలో పూరి మొదట అనుకున్న హీరో పవన్ కాదు. అవును మీరు విన్నది నిజమే… ‘బద్రి’ స్క్రిప్ట్ ను మొదట పవన్ కోసం పూరి రాసుకోలేదట . రాంగోపాల్ వర్మ దగ్గర 18 వ శిష్యుడు గా పూరి జగన్నాథ్ పనిచేసేవాడు. పూరి ఆ టైములో రాంగోపాల్ వర్మ కి అత్యంత సన్నిహితుడు అయిన నాగార్జున తో పూరీకి కూడా మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో పూరి మొదట నాగార్జున ని దృష్టిలో పెట్టుకునే ‘బద్రి’ కథని రాసాడు.

కానీ ఆ సమయంలో నాగార్జున ఇతర చిత్రాలతో చాలా బిజీగా ఉండడంతో …. వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అందులోనూ అప్పటికే కరుణాకరన్, అరుణ్ ప్రసాద్ వంటి ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుని పవన్ వద్దకు వెళ్లి నేను మొదటి సన్నివేశం నుండి క్లైమాక్స్ వరకు చెప్తాను నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలి అని పవన్ దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోని బద్రి స్క్రిప్ట్ మొత్తం చెప్పాడు .

తరువాత పవన్ చెప్పిన కొన్ని మార్పులు చేయగా… క్లయిమాక్స్ మాత్రం చేంజ్ చెయ్యను అని ముక్కు సూటిగా పూరి పవన్ కు చెప్పడం.పూరి ఆటిట్యూడ్ కూడా పవన్ కు నచ్చడంతో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అలా ఆ కథ పూరి నాగార్జున కోసం అనుకుంటే పవన్ వద్దకు వెళ్ళి టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచింది .

లెజెండరీ దర్శకుడు కె వి రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక చిత్రంలో శివుడిగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆ సమయంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్. పరమశివుడి క్యారెక్టర్ చేసేటపుడు శివుడి మెడలో నాగుపాము కూడా ఉండాలి. నాగుపాము కోసం అప్పట్లో రబ్బర్ పాములను కొందరు ఉపయోగించేవారు. మరికొందరు కోరలు తీసిన పాములను షూటింగ్ కోసం వాడేవారు. ఎన్టీఆర్ కి రబ్బర్ పామును వాడడం వల్ల ఎలర్జీ రావడంతో ఈ మూవీ షూటింగ్ లో కోరలు లేని పామును ఉపయోగించారు.
సన్నివేశాన్ని షూట్ చేసే ముందు పాములను ఆడించే అతను ఆ పాముకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే పాముకి ట్రైనింగ్ ఇవ్వడం చూసిన ఎన్టీఆర్, అతన్ని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారంట. దానికి సింగీతం శ్రీనివాస్ పాము మెడలోకి వెళ్ళేలా ట్రైనింగ్ ఇస్తున్నారని అన్నారంట. అప్పుడు ఎన్టీఆర్ “అలాంటిది ఏమి అవసరం లేదు. వారిని వదిలిపెట్టండి. మెడలోకి ఆయనే వస్తారు” అని అన్నారంట. ఎన్టీఆర్ అలా అనగానే దర్శకుడు కె వి రెడ్డి “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి కూడా బ్రెయిన్ ఉంటదని భావిస్తున్నాడా ” అని అన్నారంట.
ఈ సన్నివేశం మొదలై, వెనకాల సౌండ్ స్టార్ట్ కాగానే ఆ పాము నెమ్మదిగా వెళ్లి ఎన్టీఆర్ మెడకి చుట్టుకుని ఆభరణంలా కనిపించిందంట. ఆ దృశ్యాన్ని చూసిన కె వి రెడ్డి, “రామారావు నువ్వు చాలా గొప్పవాడివి, అంతకుమించిన వాడివి” అంటూ దణ్ణం పెట్టారంట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గత ఏడాది మే 28 నుండి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు.











ప్రతీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పైన దాని ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. గడువు దాటిన సిలిండర్లలో లీకేజీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సిలిండర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సిలిండర్ పైన భాగంలో గుండ్రటి హ్యాండిల్ లాంటిది పట్టుకునేందుకు ఉంటుంది. దాని కింది వైపుగా సిలిండర్‌కు సపోర్ట్ గా 3 ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్ల లోపలి వైపున చూసినపుడు నంబర్స్ ఉండడం కనిపిస్తుంది. ఈ మూడింటిలో ఒక దాని మీద ఆ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ తేదీ ఉంటుంది.
అలా దానిపైన ఒక ఇంగ్లీష్ అక్షరం మరియు నంబర్ ఉంటుంది. అవి సంవత్సరం మరియు నెలకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న సిలిండర్ పైన A 22 అని ఉంటే జనవరి నుండి మార్చి, 2022 వరకు అర్ధం. మార్చి ఆ సిలిండర్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక B అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు, C అంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు, D అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు అని అర్థం. ఇక నంబర్ సంవత్సరాన్ని తెలుపుతుంది.
గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చిన వెంటనే, దాని ఎక్స్పైరీ తేదీని చెక్ చేసుకొని తీసుకోవాలి. లేదంటే గడువు దాటిన సిలిండర్ లీకేజీల వల్ల పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సీల్ ను కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎలాంటి క్రాక్స్ ఉండకూడదని రూల్స్ చెబుతున్నాయి.






కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీ అంటేనే, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సంగీత, నృత్య, సాహిత్య, కళాత్మక విలువల గురించి అద్భుతంగా చూపిస్తుంటారు. అదేకోవలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించగా కీలక పాత్రలలో చాలామంది నటీనటులు కనిపించారు.
కళ అనేది జన్మ జన్మల పుణ్యం వల్లే వస్తుందని గ్రహించలేని వేదపండితుడి కూతురు కథే ఈ మూవీ. సమాజం వేగంగా మారుతోంది. దానితో పాటే మనమూ వెళ్లాలి. సంప్రదాయ కళలనే నమ్ముకుని బావిలో కప్పల బతకడం ఏమిటి అనుకునే మీనాక్షి పాత్రలో భానుప్రియ అద్భుతంగా నటించింది. మూవీ ప్రారంభంలో తండ్రి నేర్పించిన కూచిపూడి నాట్యం కడుపు నింపదనే భావనతో అయిష్టత ప్రదర్శస్తుంటుంది. ఆ సమయంలో ఆమె తయారయ్యే విధానం కూడా గందరగోళంగా ఉంటుంది.
కానీ ఆమెలో మార్పు వచ్చిన తరువాత ఆమె తయారయ్యే విధానంలో మార్పును చూపిస్తూ, దర్శకుడు ఆ విషయాన్ని స్పష్టంగా ఆ సన్నివేశంలో చూపించారు. అప్పటి ప్రేక్షకులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించారో లేదో కానీ, ఒక మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూ కు ఈ రెండు సీన్స్ ను కలిపి చందమామ కథలు అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేస్తూ, అసలు పాత సినిమాలలోనే చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహించలేదు అంటూ రాసుకొచ్చారు.




