మిస్సమ్మ, గుండమ్మకధ, మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, సత్యం శివం, చాణక్య చంద్రగుప్త ఇలా ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించారు.
ఆ తర్వాత ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్ లో దేవుడు చేసిన మనుషులు చిత్రం చేయడం.. దానికి మంచి గుర్తింపు రావడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్లు కూడా ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాల పై ఆసక్తి చూపించారు. ఎన్టీఆర్ ఎన్నో చిత్రాలు చేసి గొప్ప నటుడిగా పేరు పొందారు.

ఎంతో మంది ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యిపోయారు కూడా. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి వంటి విజయవంతమైన సినిమాలు చేసిన తరవాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ప్రమాణ స్వీకారం చేశారు, పదవి కాలం పూర్తి అయ్యాక 1989లో ఆయన ఎన్నికలకు వెళ్ళినప్పుడు.. ఎన్టీఆర్ పై కొన్ని వ్యంగ్య చిత్రాలు వచ్చాయి.
గండిపేట రహస్యం, రాజకీయ చదరంగం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి వంటి చిత్రాలు తర్వాత దర్శకురాలు విజయనిర్మల ఒక ఫంక్షన్ లో కనపడితే అందరి ముందు ఆయన నా మీద తీయడానికి ఇంకా ఏమైనా మిగిలి ఉందా అని నవ్వుతూ విజయనిర్మలని అడిగారట. ఎన్టీఆర్ ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు కానీ చాలా సరదాగా తీసుకున్నారు.










































