పిల్లలు ప్రతి విషయాన్ని తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు…? ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా పిల్లలు గమనించి వాటిని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు మొదట జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ముందు కొన్ని విషయాలని తప్పక గుర్తు పెట్టుకుని ఆచరించాలి.
పిల్లల ముందు తల్లిదండ్రులు చేసే పొరపాట్ల వల్ల పిల్లలు కూడా వాటినే రిపీట్ చేసే అవకాశం ఉంది. మరి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
#1. మీ పార్ట్నర్ తో గొడవ పడడం లేదంటే వాదించుకోవడం:
పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వాదించుకోకూడదు అలానే గొడవ పడకూడదు ఇది పిల్లలకి ఇన్ సెక్యూరిటీని ఇస్తుంది అలానే పిల్లలు కూడా అదే రిపీట్ చేసే ప్రమాదం ఉంది.
#2. గ్యాడ్జెట్స్ తో ఎక్కువ సమయాన్ని గడపకండి:
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్స్ అంటూ లాప్టాప్స్ అంటూ వాటి ముందు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. పిల్లలు కూడా వాటి మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంది కాబట్టి మీకు పిల్లలు ఉన్నట్లయితే ఈ తప్పుని మీరు కూడా చేయకండి.
#3. ఇతరులతో పోల్చడం:
చాలామంది తల్లిదండ్రులు ఇతరులతో పోల్చి వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా అలా చేయకండి. ఎవరి స్టామినా వాళ్ళది ఎవరి ట్యాలెంట్ వారిది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ పొరపాటున తల్లిదండ్రులు చేయకూడదు.
#4. ఇతరుల ముందు పిల్లలని ఏడిపించడం:
తోటి పిల్లల ముందు మీ పిల్లలని ఏడిపించకండి. అలానే వాళ్ల మీద పని చేయకండి.
#5. ధూమపానం, మద్యపానం చేయొద్దు:
స్మోకింగ్ డ్రింకింగ్ వంటివి పిల్లలు ముందు తల్లిదండ్రులు చేయకూడదు. ఇలా చేయడం వలన మీ పిల్లలు చెడ్డబాట పట్టే అవకాశం ఉంది. పిల్లలు ముందు మంచి పనులు చేయడం మంచి విషయాలను వాళ్ళకి నేర్పడం వంటివి మీరు చేస్తే కచ్చితంగా పిల్లలు జీవితంలో పైకి రాగలుగుతారు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా జీవించగలరు.