త్రినయిని సీరియల్ జీ లో రెండు మార్చి 2020 నుండి వస్తోంది. అశీక పడుకొనే, చందు బి గౌడ, పవిత్ర జయరాం ఈ సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్ మెయిన్ కథని బెంగాలీ భాష నుండి తీసుకున్నారు. సూపర్ నాచురల్ ఫిక్షన్ డ్రామా ఇది. అయితే సాధారణంగా మనం పాముల కి నాగుల చవితి వంటి సందర్భాలలో పాలు పోస్తూ ఉంటాము.

Video Advertisement

పుట్ట లో పాలు పోసి వెళ్ళిపోతూ ఉంటాము. నిజానికి పాము అంటే ఎవరికైనా భయం వేస్తుంది. పాముని దూరం నుంచి చూసి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు.

కానీ త్రినయిని సీరియల్ లో ఒక విడ్డూరం జరిగింది. మరి ఇక ఆ విషయాన్ని చూస్తే.. సీరియల్ లో పాము పాల సీసాని పట్టుకుని వెళ్ళిపోతుంది ఇల్లు దిగిపోయి ఆ తర్వాత ఇంటి నుండి రోడ్డు మీద కి పాము వెళ్ళిపోతుంది. అలా ఆ పాము పాల సీసాన్ని పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సీరియల్ లో పాము ఇలా పాలని పట్టుకు వెళ్లడం చూపించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలా కూడా పాము పాలు తీసుకు వెళ్తుందా  అని పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి చూడడానికి ఏదైనా నమ్మశక్యంగా ఉండాలి కానీ మరీ ఇంత ఘోరంగా సీన్ తీసారేంటి..? ఇది చూసిన నెటిజెన్లు అవాక్కవుతున్నారు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు.

త్రినయిని సీరియల్ నుండి వచ్చిన ఆ సీన్ ఇప్పుడు తెగ షికార్లు కొడుతోంది. ఇది చూసిన వాళ్ళు నవ్వుతున్నారు. ఈ సీన్ ని చూస్తే మీరు కూడా నవ్వుతారు. మరి అంత ఘోరంగా తీసారు. చూస్తే కచ్చితంగా మీకు కూడా అలానే అనిపిస్తుంది. చూసేయండి.