ఒకప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా పిలవబడిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫేస్ బుక్ లో అందరికన్నా అత్యధికంగా 4 కోట్ల 40 లక్షల ఫాలోవర్స్, ట్విట్టర్ లో 5 కోట్ల 33 లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్ లో 30 లక్షల సబ్స్క్రైబర్లను ఉన్న మోడీ గారు ఇకపై తను సోషల్ మీడియాలో కొనసాగాలా వద్దా అనే నిర్ణయాన్ని వచ్చే ఆదివారం లోపు తీసుకుంటానని ప్రకటించారు.

దీనికి గల కారణాలను ఆయన ఇంకా వివరించనప్పటికీ ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్ల ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

































ట్రంప్ ఫామిలీ ఈ రోజు రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేస్తారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఈ హోటల్ ఉంది. ట్రంప్ అక్కడ బసచేయడంతో బందోబస్తు గట్టిగ ఉంది. గతంలో కూడా పలు ప్రముఖులు ఆ హోటల్ లో బస చేసారు. ట్రంప్ బస చేయనున్న గది హోటల్లోని 14వ అంతస్తులో ఉంది. ఈ గది అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి ఆ గదిలో. ఇక ఖర్చు విషయానికి వస్తే సామాన్యులు నోరెళ్లబెట్టక తప్పదు అనుకుంట.
