ఇలాంటి మామగారు దొరికితే పండగే అనుకుంట…కూతురుతో పాటు అత్తారింటికి ఏం పంపించారంటే.?

ఇలాంటి మామగారు దొరికితే పండగే అనుకుంట…కూతురుతో పాటు అత్తారింటికి ఏం పంపించారంటే.?

by kavitha

Ads

గోదారోళ్ల మర్యాదలు, ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆతిథ్యంలో గోదావరి జిల్లా వారు ఎప్పటికప్పుడు వారి ప్రత్యేకత చాటుకుంటుంటారు. వాటికి సంబంధించిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తెలిసిందే.

Video Advertisement

ఇక వివాహం జరుగుతుందంటే, రకరకాల  పిండి వంటలు చేస్తుంటారు. వారి ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడంటే వందకు పైగా వంటకాలతో  ఆతిథ్యం ఇస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువగా ఇలాంటి  మర్యాదల్ని  చూస్తుంటాము. తాజాగా ఓ తండ్రి కుమార్తె పెళ్లి వరుడు తరుపు వారి కళ్ళు చెదిరేట్టు టన్నుల కొద్దీ స్వీట్స్ సారెగా  పంపి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దెందుకూరి సత్తిబాబు రాజు ఇటీవల తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు. కుమార్తె  సాహితీని భీమవరంకు చెందినటువంటి  కనుమూరి గౌతమ్ వర్మతో పెళ్లి నిసచేయం చేశారు. ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న సత్తిబాబు రాజు, కొబ్బరి తోటలో అద్భుతమైన సెట్టింగులు, పందిరి వేసి కుమార్తె పెళ్ళిని గ్రాండ్ గా జరిపించాడు.
పెళ్లిని అందరు ఘనంగా చేశారని అనుకుంటే, దానికి మించి సారె పంపించి అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. పెళ్లి చేసి, అత్తారింటికి పంపిస్తున్న కూతురితో పాటు 2700 కిలోల స్వీట్స్, దాదాపు మూడు టన్నుల స్వీట్స్ ను సారెగా  సత్తిబాబు రాజు పంపించాడు. అది కూడా స్వీట్స్ షాప్స్ లో ఆర్డర్ లాంటివి ఇవ్వకుండా ఇంట్లోనే, కుటుంబ సభ్యులందరు కలిసి ఆ స్వీట్స్ ను తయారు చేశారట.
సత్తిబాబు రాజు కుటుంబ సభ్యులు వివాహానికి వారం రోజుల ముందు నుంచి ఈ స్వీట్స్ తయారుచేయడం ప్రారంభించారట. పాలకోవ, లడ్డు, తొక్కుడు లడ్డు, పుతరేకులు, గోరుమిటీలు లాంటి స్వీట్స్ తో వారిల్లు అంతా నిండిపోయిందట. ఇక స్వీట్స్ ను అందరికి పంచడం కోసం ఒక స్టీల్ బాక్స్ ను సైతం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ సారె వల్ల మర్యాదలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కోనసీమ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.

Also Read: రైలులో మహిళతో వ్యక్తి అనుచిత ప్రవర్తన… ఆ మహిళ ఏం చేసింది అంటే…?


End of Article

You may also like