ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు శైలజ ప్రియ అలియాస్ ప్రియ. ఎన్నో సంవత్సరాలుగా ప్రియ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా మనల్ని అలరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో కూడా చాలా మంది కంటెస్టెంట్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితి ఎలా ఉన్నా కూడా ప్రియ మాత్రం అంతే స్ట్రాంగ్ గా ఎప్పుడూ ఎమోషన్స్ ని బయటికి చూపించకుండా చాలా స్టేబుల్ గా ఆడుతూ ఉంటారు.
ప్రియా తన కూతురు గురించి ఇటీవల ఎపిసోడ్లో ఈ విధంగా చెప్పారు. తన కూతురు కోవిడ్ సమయంలో క్యాన్సర్తో చనిపోయారు అని, ఆ సమయంలో అమ్మాయి పడిన బాధ అంతా ఇంతా కాదు అని ప్రియ చెప్పారు. పాప మరొక రెండు రోజులు మాత్రమే బతుకుతుంది అని డాక్టర్ చెప్పడంతో స్మశానంలో ఖాళీలు లేని కారణంగా తన కూతురు చనిపోకముందే స్మశానంలో చోటు చూసుకోవాల్సి వచ్చింది అని,
రెండు రోజులు ముందే కూతురికి స్మశానం బుక్ చేసి తర్వాత ఇంటికి వచ్చి అమ్మాయితో నవ్వుతూ మాట్లాడటం తనకి చాలా బాధగా అనిపించింది అని భావోద్వేగానికి గురయ్యారు. తన పాప ఎప్పుడూ నవ్వుతూ ఉండేది అని కొంచెం గాలి ఎక్కువ ఇచ్చినా కూడా ఊపిరి ఆడక ఇబ్బంది పడేది అని అన్నారు. ఆఖరికి తన బాధను కూడా వ్యక్తం చేసే శక్తి లేక ఏడుస్తూ ఉండేది అని చెప్పారు. అందుకే తాను బాధ ఉన్నా కూడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేయను అని ప్రియ చెప్పారు. ఇదంతా నటరాజ్ మాస్టర్, విశ్వ, లహరి, ప్రియాంకతో ఒక సందర్భంలో ప్రియ మాట్లాడారు.