బిగ్ బాస్ తెలుగు సీజన్-5 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సరయు ఒకరు. తన ఆటతీరుతో, అలాగే ముక్కు సూటిగా మాట్లాడే విధానంతో సరయు ఇంకా చాలా వారాలు షోలో ఉంటారు అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సరయు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అంతకుముందు జీ తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్ లో నటించిన సరయు, యూట్యూబ్ లో 7 ఆర్ట్స్ అనే ఒక ఛానల్ లో చేసే వీడియోల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అందులో కంటెంట్ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
అలా తక్కువ సమయంలో సరయు ఎంతో పేరు సంపాదించుకున్నారు. అయితే సరయు బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు షణ్ముఖ్ జస్వంత్ గురించి మాట్లాడుతూ తన గేమ్ తను ఆడట్లేదు అని చెప్పారు. ఈ విషయంపై షణ్ముఖ అభిమానులు సరయు సోషల్ మీడియా ఎకౌంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. దాంతో సరయు ఒక వీడియో ద్వారా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి జరుగుతాయో చెప్పారు.
సరయు ఒక సందర్భంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు. అందులో తాను అంతకుముందు ఒక వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పారు. సరయు మాట్లాడుతూ, “నేను ఆ వ్యక్తి తో ఏడు సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు, ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా ఇంట్లో కూడా చెప్పకుండా నేను ఏం పని చేయను”.
రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నా కెరీర్ ని కూడా పక్కన పెట్టాను. మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ కుదరలేదు. పెళ్లి పీటల దాకా వచ్చిన వివాహం ఆగిపోయింది. ముందు 25 లక్షలు అడిగారు, తర్వాత అరకోటి అడిగారు. తర్వాత కోటి, చివరికి సగం ఆస్తి అడిగారు. ఇప్పుడే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకేమి అడుగుతారో? అసలు ఎలా ఉంటారో? అని క్యాన్సిల్ చేశాను. నువ్వు నాకు తగిన వాడివి కాదు అని అతని ముఖం మీద చెప్పేసాను” అని సరయు చెప్పారు.