బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఇంట్లో సంబరాలు సంబరాలు అంబరాన్నంటాయి. పండంటి బిడ్డ పుట్టిందంటూ సోషల్ మీడియాలో అంబటి అర్జున్ పోస్ట్ చేయడంతో సహచరులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు పంపిస్తున్నారు. బిగ్‌బాస్ షోలో ఉండగానే ప్రెగ్నెంట్ అయిన భార్యని ఇంట్లో వదిలేసి వచ్చేసాను అని చాలా ఎమోషనల్ అయ్యేవాడు.
అది చూసి బిగ్ బాస్ కూడా చివరికి అర్జున్ భార్య సురేఖ సీమంతాన్ని జరిపించేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అర్ఖా అనే పేరు పెట్టుకుంటాను అని చెప్తూనే ఉన్నాడు అర్జున్. అతనికి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టమని కూతురు పుడితే బాగుంటుంది అని ఆశపడ్డాడు. అయితే అనుకున్నట్లుగానే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన అర్జున్ వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

నిజానికి గర్భంతో ఉన్న తన భార్యను వదిలేసి బిగ్ బాస్ హౌస్ కి రావడం తనకి ఇష్టం లేదని ఏ భార్యకైనా కూడా ఇలాంటి సందర్భంలో భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది కానీ తను మాత్రం బిగ్ బాస్ షో కి వచ్చానని అలా రావటం తనకు చాలా బాధగా అనిపించిందని అర్జున్ స్టేజి మీద ఎన్నోసార్లు చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆడబిడ్డ పుట్టడంతో అర్జున్ ఆనందంతో తేలిపోతున్నాడు.
బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు సైతం అర్జున్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం అర్జున్ పలు టీవీ షో లతో బిజీగా ఉన్నాడు. పూర్ణ తో సుందరి అనే సినిమాలో హీరోగా నటించిన అర్జున్ ఇప్పుడు మరో చిత్రం ద్వారా హీరోగా మన ముందుకి రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనాప్పటికీ మనం అనుకున్నది జరిగితే ఆ ఆనందమే వేరు ఇప్పుడు అలాంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అర్జున్.

బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్‌కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్‌కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్దీప్ నిలిచారు. ఈ సందర్భంగా వారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కు, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరారు. మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని, గీతూ రాయల్ కారు అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న ప్రశాంత్, అతని సోదురుడిని అరెస్టు చేశారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏ3, ఏ4ల నిందితులను ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు. కాగా, పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ దాడి విషయంలో తన ప్రమేయం ఏం లేదని అన్నారు. ఫ్యాన్స్ తాను రెచ్చగొట్టలేదని వెల్లడించారు.


అమర్ దీప్‌ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్‌గా యూట్యూబ్ ఛానల్స్ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.
బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్‌ని బయటకు లాగాడానికి ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్‌కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..

4.
5.
6.
7.
8.




కానీ విన్నర్ ఎవరనేది ముందే ప్లానింగ్ చేసి ఉంటాదని చాలామంది నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం వరకు ఉన్న ఆటను బట్టి విన్నర్ ఎవరంటే ఎక్కువగా శివాజీ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పటికీ శివాజీ బాగా ఆడుతున్నాడని నెటిజన్లు అంటున్నారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేవరకూ కూడా తనపై చాలా నెగిటివిటీ ఉంది.