ఒక సినిమా రూపొందడం వెనుక తెరమీద కనపడే నటులే కాదు.. తెర వెనుక కనపడని ఎందరో కృషి ఉంటుంది..లైట్ మన్ నుండి డైరెక్టర్ వరకు 24క్రాఫ్ట్స్ సమిష్టి కృషి ఫలితమే చలనచిత్రం..అందులో డబ్బింగ్ ఒక్కటి.. తెరమీద కనిపించే పాత్రల హావభావాలకు తగినట్టుగా మాట్లాడడం ఆషామాషి వ్యవహారం కాదు..మనకి బాగా నచ్చిన చిత్రాల్లో మనకి వినపడే వాయిస్ ఫలానా వ్యక్తిది అని తెలిస్తే ఏదో ఆశ్చర్యానికి లోనవుతాం..ప్రస్తుతం శుభలేఖ సుధాకర్ విషయంలో కూడా అదే జరుగుతోంది..
గతేడాది విడుదలైన కన్నడ చిత్రం తెలుగు డబ్ మూవీ కెజిఎఫ్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే..కెజిఎఫ్ 2 కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. ఆ సినిమాలో మొదటి నుండి చివరి వరకు ఒక వ్యక్తి స్టోరీ చెప్తూ ఉంటారు…ఆ పాత్ర పోషించింది అనంత నాగ్ అయితే ఆ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు సుపరిచితులు శుభలేఖ సుధాకర్.. కెజిఎఫ్ సినిమాలో ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్లా అనిపిస్తుంటుంది..ఆ వాయిస్‌లో బేస్ అలాంటిది.. సాహో సినిమా మొత్తం ఒక ఎత్తైతే చివర్లో వచ్చే “సిద్దాంత్ నందన్ సాహో” అని వచ్చే డైలాగ్ మరో ఎత్తు ఆ వాయిస్ కూడా శుభలేఖ సుధాకర్ దే..
కామెడీ, సెంటిమెంట్, విలనిజం ఇలా ఏదైనా అలవోకగా పండించగల నటుడు శుభలేఖ సుధాకర్ . 80వ దశకం నుండి సినిమాల్లో నటిస్తున్నారు..శుభలేఖ సినిమాతో పరిచయం అయిన ఆయన తొలి సినిమా పేరునేఇంటిపేరుగా మార్చుకుని సురావఝుల సుధాకర్ కాస్తా శుభలేఖ సుధాకర్ అయ్యారు.. తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన ఈ మధ్య సినిమాలతో పాటు, సీరియల్స్ కూడా చేస్తూ బిజి అయ్యారు.
ప్రముఖ గాయని ఎస్ పి శైలజ , సుధాకర్ ఇద్దరూ భార్యభర్తలు అనే విషయం తెలుసు..శైలజ సినిమాల్లో పాటలు పాడడంతో పాటు ఎందరో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్తారనే విషయం కూడా అందరికి తెలిసిందే..కాని సుధాకర్ వాయిస్ గురించి ఈ మధ్య ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.. అదే విషయం ఆయనతో ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేస్తే..సక్సెస్ అనేది ఒకటుంటుంది..నేనెప్పటినుండో డబ్బింగ్ చెప్తున్నాను..కానీ కెజిఎఫ్ అనే చిత్రం నాకు,నా వాయిస్ కి సక్సెస్ ని ఇచ్చింది..అని అన్నారు.