కరోనా దెబ్బకి మొత్తం మన లైఫ్ స్టైలే మారిపోయింది.. ఆఖరికి స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఇంట్లోనే మొబైల్ ఫోన్ ముందు కూర్చుని క్లాసులు వినాల్సిన పరిస్థితి..కెజి నుండి పిజి వరకు ఇప్పుడు అందరూ ఆన్లైన్ క్లాస్ ల ద్వారానే పాఠాలు వింటున్నారు.. కానీ ఇదే విషయాన్ని పన్నెండేళ్ల క్రితమే “ఐడియా” నెట్ వర్క్ యాడ్ లో చూపించారు..కాకపోతే అప్పుడు ఆడియో ,ఇప్పుడు వీడియో అంతే తేడా..
idea school ad ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది… ఐడియా నెట్ వర్క్ ఈ యాడ్ అప్పట్లో పాపులర్.. ఆ క్యాప్షన్ మాత్రం ఇప్పటికి పాపులరే..టెలికాం రంగంలో జియో ప్రభంజనం స్టార్ట్ అయ్యాక అన్ని టెలికాం కంపెనిలు మరుగున పడిపోయాయి అని చెప్పవచ్చు..ప్రస్తుతం ఐడియా హవా తగ్గిపోయినా, ఇఫ్పుడు ఐడియా కి సంబంధించిన ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
“ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ” పేరిట బాలివుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఐడియా నెట్వర్క్ కి సంబంధించిన ఈ యాడ్ లో విద్య యొక్క ప్రాముఖ్యతని చూపించారు..క్లాస్ రూం పద్దతి అనేది ఎంతో మందికి విద్యను దూరం చేస్తుందని, విద్య అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశ్యంతో రూపొందించబడిన ఈ యాడ్ ఒక అర్దవంతమైన ఆలోచనను అందరిలోనూ కలిగించింది..పన్నెండేళ్ల క్రితం ఆ యాడ్ లో చూపించిన ఆన్లైన్ క్లాసుల పద్దతి ప్రస్తుతం కరోనా కాలంలో అందరూ ఫాలో అవుతున్నారు..సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఆ యాడ్ పై మీరు ఓ లుక్కేయండి.