ఇటీవల లియో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో విజయ్. విజయ్ తమిళ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు.
విజయ్ ఇప్పటివరకు ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా కూడా తెలుగులో ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నారు.

నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభుదేవా, స్నేహ ఇంకా ఎంతో మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. మీనాక్షి చౌదరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. అయితే విజయ్ లేటెస్ట్ గెటప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.

విజయ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోస్ లో విజయ్ అని పోల్చుకోవడానికి కూడా వీలులేని అంత డిఫరెంట్ గా ఉన్నారు. మరి ఇది కొత్త సినిమా గెటప్ అయినా అయ్యుండొచ్చు. కానీ విజయ్ ని ఇలా చూసిన వాళ్ళు మాత్రం “విజయ్ కి ఏమయ్యింది? ఇలా మారిపోయారు ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత లియో 2 సినిమా చేస్తారు. మొదటి పార్ట్ లో వివరణ ఇవ్వని విషయాలకు ఈ సినిమాలో వివరణ ఇస్తారు.

ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఖైదీ 2 సినిమా అయ్యాక ఈ సినిమా చేస్తాను అని చెప్పారు. ఈ సినిమాలు అన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఖైదీ సినిమాలో నటించిన కొంత మంది నటులు, విక్రమ్ సినిమాలో నటించిన కొంత మంది నటులు లియో సినిమాలో కూడా కనిపించారు. అంతే కాకుండా లియో దాస్ కి సంబంధించిన విషయాలు కూడా లియో పార్ట్ 2 లో చూపిస్తారు.
watch video :
Cute only 😍 pic.twitter.com/DxYPmolNHK
— Tom 😺 (@hodophile1322) December 30, 2023

బబుల్ గమ్ మూవీతో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ పాపులర్ అయ్యింది హీరో తండ్రి చికెన్ కొట్టు యాదగిరి. ఈ పాత్రలో నటించిన యాక్టర్ పేరు చైతు జొన్నలగడ్డ.
ఈ పేరు వినగానే గుర్తొచ్చేది డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆయన అన్నయే చైతు జొన్నలగడ్డ.హీరోకి తండ్రిగా చైతు జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ యాసలో చికెన్ కొట్టు యాదగిరి అద రగొట్టాడు. ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను అలరిస్తాయి. హీరోయిన్ ఇంటికొచ్చినపుడు ఈ హీరో, హీరో తండ్రి మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకుంది.
ఈ మూవీలో తండ్రిగా నటించినా, చైతు జొన్నలగడ్డని స్క్రీన్ పై మొదటిసారి చూసినపుడు హీరో అన్నయ్యలా అనిపిస్తారు. చైతు జొన్నలగడ్డ ఎక్స్ప్రెషన్స్, స్లాంగ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని హీరో సిద్దు జొన్నలగడ్డను గుర్తొచ్చేలా చేస్తాయి. ఈ మూవీ చైతు జొన్నలగడ్డ మొదటి చిత్రం, అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లా నటించారు.

















