రణబీర్ కపూర్ రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా తాజాగా నేను డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై బోలెడు ఆశలను పెట్టుకున్నారు. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. విడుదలకు ముందే బుకింగ్స్ సమయంలోనే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి.

అయితే బాలీవుడ్ లో పర్సేంటేజ్ బేస్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్కడ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి రేటుకి సినిమా బిజినెస్ జరిగింది ఇప్పుడు, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో వాల్యూ బిజినెస్ రేంజ్ 14 కోట్లకు పైగా సొంతం చేసుకుంది ఈ సినిమా. రణబీర్ కపూర్ కెరీర్ లో ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. నైజాంలో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ లలో కూడా ఒక పెద్ద సినిమా ఏ రేంజ్ లో రిలీజ్ కానుందో అలాంటి థియేటర్స్ కౌంట్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక తెలుగ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ మూవీ 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో శుక్రవారం ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా ఈ సినిమా 15 కోట్ల వరకు షేర్స్ ని రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ని సాధించడం ఖాయం అని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయింది అంటే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పవచ్చు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది.







హీరో నితిన్ ఒక్క లుక్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్లో హీరో నితిన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు వంశీ అండ్ టీం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన పెండ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్‌కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో నితిన్ ఈసారి మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని ఫ్రెష్ లుక్ తో చెబుతున్నాడు.నితిన్ ఈ చిత్రంలో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.అయితే ఈ సినిమాలో ఒక్క ఎపిసోడ్ నే ఇలా కనిపిస్తాడని, సినిమా కథ వేరని సమాచారం. నితిన్ ఒక్క సన్నివేశం కోసమే గెడ్డం పెంచాడని టాక్ వినపడుతోంది. కొన్ని రోజులు అడవుల్లో తొలి షెడ్యూలు పూర్తి చేసి, ఆ తరువాత షూటింగ్ ని హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారని, ఈ గెటప్, ఈ సీన్ కు, మిగిలిన కథకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి వుంది. ఈ సినిమాకు సంగీతం హారిస్ జయరాజ్ అందిస్తున్నారు.















అది ఆయన ఇష్టమని, చిరంజీవి నిజమేంటో తెలుసుకాకుండా కామెంట్లు చేయడం బాధ అనిపించిందని అందుకే ఆయన పైన 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై చెరో పది కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ డబ్బును తమిళనాడులో ఇటీవల మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబానికి పంచుతానని అన్నాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నాడు. ఇప్పుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.అయితే త్రిషకి మద్దతుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్లందరిని వదిలేసి ఒక్క చిరంజీవి పైనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మన్సూర్ అలీ ఖాన్ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చిరంజీవి అభిమానులు అంటున్నారు.





