రాజరవింద్ర ప్రధాన పాత్రలో సాయి జ క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశిశ్యులతో ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలూ గా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం” సారంగదరియా” ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదల అయ్యింది ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ: సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది ఫ్యామిలీ చిత్రం గా త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి మరియు ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న పద్మారావు అలియాస్ పండు కి “సారంగదరియా” సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ. మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము మా “సారంగదరియా” అందరికీ నచ్చేలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ తెలిపారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ..
అందరికీ నమస్కారం నేను “సారంగదరియా” మూవీ తో దర్శకుడిగా పరిచయమవుతున్నను ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి ధన్యవాదాలు ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ .

చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర గారికి మా ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యాలి అనుకుంటున్నాము త్వరలోనే మిగతా విషయాలు తెలియజేస్తాము ఆని అన్నారు.

నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు

టెక్నీషియన్స్
ప్రొడ్యూసర్స్ – ఉమా దేవి, శరత్ చంద్ర చల్లపల్లి
డైరెక్టర్ – పద్మారావ్ అబ్బిశెట్టి (పండు)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అరుణాచల మహేష్
డైలాగ్స్-వినయ్ కొట్టి
ఎడిటర్ – రాకేష్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ – M. ఎబెనెజర్ పాల్
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు
లిరిక్ రైటర్స్ – రాంబాబు గోశాల & కడలి సత్యనారాయణ
అడిషనల్ రైటర్ – రఘు రామ్ తేజ్.K
పి ఆర్ ఓ : కడలి రాంబాబు






చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఎన్నో కష్టాలు పడి, మెగాస్టార్ గా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. చిరంజీవి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఆయన అసలు పేరు శివ శంకర వరప్రసాద్. 1955లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఆగష్టు 22న చిరంజీవి జన్మించారు. ఆయనకు చిన్నతనంలోనే నటన పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువు పూర్తి చేసుకొని చిరంజీవి 1976లో చెన్నైలో ఉన్న మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి, నటనలో శిక్షణ తీసుకున్నారు.
చిరంజీవి 1978లో ‘పునాది రాళ్లు’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. అయితే ఆ మూవీ కన్నా ముందు ‘ప్రాణం ఖరీదు’ అనే మూవీ విడుదల అయ్యింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలో నటించిన ‘మనవూరి పాండవులు’ అనే మూవీతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. మోసగాడు, ఇది కథ కాదు, రాణీ కాసుల రంగమ్మ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, విలన్గా కూడా నటించి నటుడిగా చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నాడు.
1980లో చిరంజీవి హీరోగా నటించిన ‘మొగుడు కావాలి’ మూవీ విజయం సాధించి, తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా రికార్డు సృష్టించింది. తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీని నిర్మించారు. ఆ తర్వాత ‘తిరుగులేని మనిషి’ మూవీలో చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన ‘చట్టానికి కళ్లులేవు’ మూవీతో మాస్ హీరోగా మారారు. ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ సినిమాలతో చిరంజీవి ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ, ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ, మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, టాలీవుడ్ లో ఎదురులేని టాప్ హీరోగా కొనసాగుతున్నారు.








కానీ అనుకోకుండా నటనలోకి అడుగుపెట్టడంతో సంగీతం పైన దృష్టి పెట్టడానికి సమయం దొరకడం లేదు. రిషబ్ శెట్టి నటించిన గరుడ గమన వృషభ వాహన సినిమాలో చైత్ర మంచి పాట కూడా పడింది. ఆమె పాడిన సోజుగాడ సోజు మల్లిగే పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకి కన్నడ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సైమా అవార్డు కూడా అందుకుంది. తాజాగా సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా బాగా ఫేమస్ అయింది. ఆమె చేసిన పాత్ర చాలా రోజులు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. చైత్ర కి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.




