నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు.
శ్రీలీల కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమాకి హిట్ టాక్ వస్తోంది. సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా బాలకృష్ణని చాలా కొత్తగా చూసాము అని కొంత మంది అంటున్నారు.

కానీ మరి కొంత మంది అయితే చాలా రొటీన్ సినిమా అని అంటున్నారు. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి కొంత మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాంతో ఈ సినిమాలో అలాంటి కామెడీ ఎక్కువగా ఉండకుండా చూసుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అలాంటి సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలోని రెండు సీన్స్ మీద మాత్రం ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అందులో మొదటిది హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే లవ్ ట్రాక్. అసలు కాజల్ లేకపోయినా సినిమా బాగానే ఉండేది.

కాజల్ పాత్ర వల్ల సినిమాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అందులోనూ ముఖ్యంగా బాలకృష్ణ ఒక పెద్దావిడని ఆంటీ అని పిలిచే సీన్ ఉంటుంది. ఆమెకి దగ్గరగా బాలకృష్ణ వయసు ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఆంటీ అని పిలిపించడం బాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఈ సినిమాలో బాలకృష్ణ కొంచెం సేపు పోలీస్ గెటప్ లో కనిపిస్తారు.

బాలకృష్ణ అంతకుముందు నటించిన రూలర్ అనే ఒక సినిమాలో పోలీస్ గా నటించారు. అందులో బాలకృష్ణ గెటప్ అస్సలు బాగాలేదు. ఈ సినిమాలో మరి అంత కాకపోయినా కూడా బాలకృష్ణకి ఆ పోలీస్ గెటప్ కాస్త సూట్ అవ్వలేదు అని అంటున్నారు. ఈ విషయాల మీద మాత్రం ఈ సినిమాలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : “విక్రమ్” కంటే ముందే… “మల్టీవర్స్” కాన్సెప్ట్ చూపించిన 3 సినిమాలు ఏవో తెలుసా..?



















17































ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. 163 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా కట్ చేయలేదని తెలిపారు. సినిమా చూసిన తాము కూడా ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు చిత్ర యూనిట్ కి తెలియజేశారు.సెన్సార్ సభ్యులు రివ్యూ చూసి సినిమా టీం ఫుల్ జోష్ లో ఉంది.