రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కరలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలే. బద్రి సినిమాలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తర్వాత ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
వీరికి అకిరా, ఆద్యా పుట్టారు. అయితే ఏవో కొన్ని కారణాలవల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మళ్లీ మూడో పెళ్లి చేసుకోవడం, రేణు దేశాయ్ తన పిల్లలతో విడిగా ఉండడం జరుగుతుంది.

ఇప్పుడు రేణు దేశాయ్ మళ్ళీ 18 విరామం తర్వాత టైగర్ నాగేశ్వరరావు తో రీఎంట్రీ కి సిద్ధమయ్యారు.ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. గతంలో తాను రెండో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించానని తర్వాత దాని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడానికి గల కారణాన్ని వివరించారు.

తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా తనకు ఓ తోడు ఉండాలని కోరుకున్నారు.అందువల్ల పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని ఉద్దేశంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నానని తెలిపారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అయితే తనకి నిశ్చితార్థమైన సమయానికి ఆద్యాకి 7 సంవత్సరాలు మాత్రమేనని… ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అద్యాకి కావలసినంత సమయం ఇవ్వలేననే ఉద్దేశంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలియజేశారు.

తనకి వివాహ బంధం అంటే చాలా గౌరవం ఉందని ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నట్లు తెలియజేశారు. ఆద్యాకి ప్రస్తుతం 13 ఏళ్లని తను కొంచెం పెద్దదయ్యాక రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. అకీరా, ఆద్యా ఇద్దరు కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తారని తెలిపారు. ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోమని అకీరా ఎప్పుడూ చెబుతూ ఉంటాడని గుర్తు చేసుకున్నారు.తన పిల్లలిద్దరూ భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు.















సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్నవ్యక్తి విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన లేటెస్ట్ తమిళ మూవీ రత్తం అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నందితాశ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీశన్ కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, స్టోరీ పరంగా రత్తం కొంచెం డిఫరెంట్ లైన్. కోల్‌కతాలో గుర్రాల కాపరిగా పని చేస్తుంటాడు రంజిత్(విజయ్ ఆంటోనీ). గతంలో తనకు మీడియా గురువు అయిన రత్నం పాండియన్ (నిళల్ గళ్ రవి) కుమారుడు హ-త్య-కు గురవుతాడు. గురువు ఈ కేసును సాల్వ్ చేసేపనిని రంజిత్ కు అప్పగిస్తాడు. రంజిత్ చెన్నైకి వచ్చి ఆయన సంస్థలోనే జాయిన్ అవుతాడు.
మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా చేరి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా, అలాంటి హత్యలే రాష్ట్రంలో చాలా జరిగాయనే విషయం తెలుస్తుంది. మరి ఈ హ-త్య-ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎలాంటి ఆధారాలు లేకుండా దొరకకుండా చేస్తున్నది ఎవరు? ఈ మ-ర్డ-ర్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసును ఛేదించే క్రమంలో రంజిత్‌కు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? రంజిత్ జర్నలిజం వృత్తికి ఎందుకు దూరంగా వెళ్ళాడు అనేది మిగిలిన కథ.
మైండ్‌గేమ్‌తో హీరో మరియు విలన్ ఒకరి పై ఒకరు వేసే ఎత్తులతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ రంజిత్‌కుమార్ గా విజయ్ ఆంటోనీ సీరియస్ పాత్రలో మెప్పించాడు. మహిమా నంబియార్ నటన ఆకట్టుకుంటుంది. రత్తం మూవీ ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. కథతో పాటుగా విలన్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓపికగా చూడగలిగిన వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.

బుల్లితెర సెలెబ్రిటీలు శ్రీవాణి, విక్రమాదిత్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ జంట ‘మీ కడపునిండా’ అనే రెస్టారెంట్‌ను మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఏపీ మంత్రి రోజాను ఆహ్వానించారు. రోజా చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. చాలా రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న రోజా, అక్కడికి వచ్చిన టెలివిజన్ సెలెబ్రిటీలతో సరదాగా ముచ్చటించారు. మీడియాతో కూడా మాట్లాడిన ఆమె వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం తెలిపారు.
రోజా మాట్లాడుతూ తనకు ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి వెల్లడించారు. తనకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని, రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు చాలా ఇష్టమని తెలిపారు. ఇక తన డైట్ ప్లాన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం ఓట్స్, దానిలో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ కలిపి తింటానని తెలిపారు. ఇక మధ్యాహ్న భోజనంలో మాత్రం నాన్ వెజ్ తప్పనిసరని అన్నారు. కార్తీకమాసం లేదా దేవాలయానికి వెళ్లిన సమయంలో మాత్రం నాన్ వెజ్ తీసుకోనని తెలిపారు.
డిన్నర్ సమయంలో ఇడ్లీ లేదా దోశ లాంటి అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చారు. విక్రమాదిత్య, శ్రీవాణి, కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకలో టెలివిజన్ నటినటులు సందడి చేశారు. వీరిద్దరూ పలు సీరియల్స్, రియాల్టీ షోలు, ఈవెంట్లు, వారి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తూ, బాగా సంపాదిస్తున్నారు. తాజాగా మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్‌లోనూ విజయం సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.