ప్రతి వారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయనే విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ మూడవ వారం విడుదల అయ్యే సినిమాలు మరింత ప్రత్యేకం కానున్నాయి. తెలుగువారు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గ్రాండ్ గా జరుపుకునే పండుగ దసరా రానుంది.
దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం ఈ వారం థియేటర్ లో పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏమిటో? ఏ రోజున రిలీజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం..
దసరా పండుగ కానుకగా ఆడియెన్స్ కు వినోదాలను పంచడం కోసం తెలుగులో ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది. రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి డబ్బింగ్ సినిమా, ముగ్గురు స్టార్ హీరోలే కావడం విశేషం.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ హయివ్ అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మాస్ మహారాజ రవితేజ మొదటిసారిగా నటించిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరావు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ నార్త్ లో ప్రమోషన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక మూడవ సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన లియో. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఎదురుచూస్తున్న సినిమాలలో లియో కూడా ఒకటి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలలో నటించారు.
1. భగవంత్ కేసరి:
ఈ సినిమా అక్టోబరు 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.
2. లియో:
ఈ తమిళ డబ్బింగ్ మూవీ అక్టోబరు 19న థియేటర్లలో విడుదల కానుంది.
3. ఘోస్ట్:
ఈ డబ్బింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.
4. టైగర్ నాగేశ్వరావు:
ఈ సినిమా అక్టోబరు 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.
5. గణపథ్: ఎ హీరో ఈజ్ బోర్న్:
ఈ హిందీ డబ్బింగ్ మూవీ అక్టోబరు 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Also Read: నాని “హాయ్ నాన్న” టీజర్లో… మైనస్ అయిన విషయం ఇదేనా..?

జాతీయ చలనచిత్ర అవార్డులను భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా పరిగణిస్తారు. మొదటిసారి జాతీయ అవార్డులను 1954లో అందించారు. ఈ అవార్డులను భారతీయ కళలు మరియు సంస్కృతిని కలిగి ఉన్న సినిమాలకు, దేశీయ వ్యక్తులు దర్శకత్వం వహించిన సినిమాలను గౌరవించడానికి మరియు ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులు ప్రవేశపెట్టారు.
1973 నుండి ఈ అవార్డు వేడుకలు భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఈ వేడుకలో విజేతలకు భారత రాష్ట్రపతి అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ వేడుక తరువాత నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలను ప్రదర్శిస్తారు.
జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు ప్రధాన విభాగాలగా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్‌లు మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద విజేతలను 13 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విజేతలను 5 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. జాతీయ అవార్డుకు సెలెక్ట్ కావడం కోసం పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఎంట్రీకి పంపించే సినిమా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందాలి.
అప్పుడే ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ పోటీలోకి వచ్చే సినిమాలు ఇండియాలోనే నిర్మించబడాలి. సినిమాకు విదేశీ సంస్థ సహ-నిర్మాతగా ఉంటే, మరో 6 షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. అన్ని షరతులను పూర్తి చేసిన తర్వాత, సినిమా ఎంట్రీ లిస్ట్ కి అర్హత పొందింది. పోటీలో పాల్గొనే సినిమాకి భారతీయుడు దర్శకత్వం వహించి ఉండాలి. సినిమా పోటీలో ఎంట్రీ పొందడానికి ఇది ముఖ్యమైనది.
కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలుగు ఆడియెన్స్ కు ఖైదీ మూవీతో పరిచయం అయ్యారు. ఆ తరువాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానులు అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే లోకేష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా కార్తీ నటించిన ఖైదీ మూవీ అని చాలామంది అనుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా మానగరం. ఈ చిత్రం 2017 లో తమిళంలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది.
ఆ సినిమానే తెలుగులో ‘నగరం’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, శ్రీ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, శ్రీ అనే యువకుడు జాబ్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వస్తాడు. ఒక సాఫ్ట్వేర్ సంస్థకి అతనికి జాబ్ వస్తుంది. రెజీనా అదే కంపెనీలో హెచ్ఆర్. ఆమె క్లాస్మేట్ అయిన సందీప్ కిషన్ లవ్ చేస్తున్న అంటూ వెంటపడుతుంటాడు. రెజీనాకు అతనంటే ప్రేమ ఉన్నా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడం ఆమెకు నచ్చదు. సందీప్ తో గోడవపడిన కొందరు సందీప్ అనుకొని శ్రీని కొడతారు.
అయితే ఆ గొడవలో అతని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోతాయి. అతను జాబ్ లో చేరాలంటే సర్టిఫికేట్స్ అవసరం. ఇది ఇలా ఉంటే, ఆ నగరంలో కొందరు గూండాలు ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయాల్సింది. పొరపాటునా ఆ ప్రాంత డాన్ పీకేపీ(మధుసూదన్) అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ నగరానికి క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం కోసం వచ్చిన చార్లే పీకేపీకి సంబంధించిన కారును రెంట్ కు తీసుకుంటాడు. సందీప్ కి రౌడీలతో ఉన్న గొడవ ఏమిటి? శ్రీ సర్టిఫికేట్స్ దొరికాయా? రెజీనా, సందీప్ ల ప్రేమ ఫలిస్తుందా? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.


ఈరోజు ఎపిసోడ్ లో డిన్నర్ చేయడానికి అందరూ కూర్చుంటారు. ఆ సమయంలోనే మహేంద్ర బాగా తాగి, తులుతూ ఇంటికి వస్తాడు. కింద పడిపోబోతుంటే, రిషి పరుగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాడు. ధరణీ, వసు, శైలేంద్ర, ఫణేంద్ర అక్కడికి వెళతారు. మహేంద్ర రిషీతో నువ్వు న్నాను పడి పోనివ్వవు అని తెలుసు నాన్నా, నువ్వు ఉన్నావనే నాకు ధైర్యం నాన్నా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. రిషి, మహేంద్రను లోపలికి రమ్మని పిలుస్తాడు. దానికి మహేంద్ర ఇంటికి రాకూడదని అనుకున్నాను.
కానీ నువ్వు నా గురించి రోడ్డు పైన వెతుకుతుంటావు ఉంటావు. అందుకే నువ్వు బాధపడతావని ఇంటికి వచ్చాను నాన్నా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. తండ్రిని అలా చూసి రిషి బాధపడుతాడు. వసు, ధరణీ, ఫణేంద్ర బాధ పడుతుంటే, దేవయానికి శైలేంద్ర సైగ చేస్తాడు. దాంతో దేవయాని మహేంద్ర తాగి ఇంటికి వచ్చినందుకు మండిపడుతుంది. తన మాటలతో మహేంద్రని దేవయాని అవమానిస్తుంది. జగతి సమయం అయిపోవడంతో, వెళ్ళిపోయింది.
4 రోజులు ఏడ్చి, ఆ విషయాన్ని మర్చిపోయి, పనులు చేసుకోవాలి. కానీ రోజు తాగి ఇంటికి వస్తుంటే, ఎలా ఉంటుంది. బాధ ఉంటే, తాగి తందనాలు ఆడాలా? అని కోపంగా దేవయాని అనడంతో రిషికి చాలా కోపం వస్తుంది. దేవయాని కోపంగా ఇక ఈ ఇంట్లో ఉండలేను,ఈ దారణం రోజు చూడలేను అని అంటుంది. దాంతో కోపంగా ఉన్న రిషి పెద్దమ్మా మీరు బయటకు వెళ్లనవసరం లేదు. మేమే వెళ్తాం అంటూ రిషి తండ్రిని, భార్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.
# స్మోకింగ్ సమస్య: మొదటి పాట నా రెడీ రిలీజ్ అయ్యింది. ఈ పాట రిలీజ్ అయిన 5 రోజుల్లోనే యూట్యూబ్‌లో 33 మిలియన్ల వ్యూస్‌ను మరియు 1.9 మిలియన్ లైక్స్‌ను సాధించింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో విజయ్ దళపతి స్మోక్ చేస్తారు. విజయ్ స్మోక్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయం పై పలువురు కేసు వేశారు.
#లిరిక్స్ సమస్య: లియో మూవీలోని ఫస్ట్ సింగిల్ నా రెడీ లిరిక్స్ కూడా వివాదాస్పదం అయ్యింది. ‘ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం మరియు రౌడీయిజాన్ని పొగుడుతూ’ తీశారని, విజయ్ పై చర్య తీసుకోవాలని తమిళనాడులో ఫిర్యాదు దాఖలైంది.
#ఆడియో లాంచ్ ఈవెంట్: లియో మూవీ ఆడియో మరియు ప్రీరిలీజ్ ఈవెంట్లు కలిపి ప్లాన్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ ఈవెంట్ రద్దు అయ్యింది.
బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

















