కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీగా పై ఇండియావైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ పెయిర్ గా పేరుగాంచిన విజయ్ దళపతి, త్రిష పద్నాలుగేళ్ళ తర్వాత ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
తాజాగా విడుదల అయిన ఈ మూవ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ మూవీ పై మరిన్ని అంచనాలను పెంచింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ ఆ తెలుగు సినిమా కాపీ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ తెలుగు సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు కొన్నేళ్ళ నుండి ఫలితాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఆయన సినిమాలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ లియో అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇటీవల కాలంలో ఏ తమిళ సినిమాకి లేనంత హైప్ లియో సినిమా పై నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఈ మూవీ తెలుగు సినిమా కాపీ అని చర్చ జరుగుతోంది. ఆ తెలుగు మూవీ ఏమిటంటే 2010లో వచ్చిన గాయం 2. రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని సమర్పించగా, ప్రవీణ్ శ్రీ డైరెక్షన్ లో తెరకెక్కింది.
గాయం 2 మూవీని హాలీవుడ్ సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్’ ఆధారంగా తీశారు. కట్ చేస్తే, లియో ట్రైలర్ కి గాయం 2కి పోలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ హిల్ స్టేషన్ లో హోటల్ రన్ చేయడం, భయపడుతూ బ్రతకడం, ప్రత్యర్థులు వచ్చి అటాక్ చేస్తే తప్పించుకోవడం, ఆఖరికి ఎదురు తిరగడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. ఆ సీన్స్ ని, గాయం 2 సీన్స్ ను పోలుస్తూ రెండింటి వీడియోస్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/gully_poragadu/status/1710889609088184487
Also Read: అనుష్క నుండి అనన్య వరకు… తెలుగు ఇండస్ట్రీకి “పూరి జగన్నాధ్” పరిచయం చేసిన 15 మంది హీరోయిన్లు వీరే.!

నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండున్నర నిముషాల నిడివి గల ట్రైలర్ లో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతుర్లుగా కనిపించారు. బాలయ్య పక్కా తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విలన్ కు సవాలు విసిరే సీన్స్ లో, బిడ్డ శ్రీలీల గురించి తల్లడిల్లిపోయే సన్నివేశాలలో బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వైపు సోషల్ మీడియాలో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా రొటీన్ గా ఉందని, పాత సినిమాలలోని మ్యూజిక్ నే కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చారని కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో అర్జున్ రాంపాల్ ను విలన్ గా సెలెక్ట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.














బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – “ఈ రోజు మధురపూడి గ్రామం అనే నేను థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నా సొంత మనిషి. హైదరాబాద్‌కి, ఇండస్ట్రీకి వచ్చిన క్రొత్తలో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్పట్లో నాకు మోరల్ సపోర్ట్‌గా ఉండేవారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్లో ఫస్ట్ కథ ఇచ్చిన శ్రీహరి గారి భద్రాద్రి సినిమాకు మల్లి గారే దర్శకులు. అప్పటి నుండి ఇప్పటి దాకా మా రిలేషన్ అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు. మధుర పూడి గ్రామం అనే నేను ట్రైలర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్గా ఉంటూనే ఎమోషన్స్‌తో నిండి ఉంది. మరో గొప్ప విషయం ఏంటంటే మణిశర్మగారు సంగీతం అందించారు. అలాగే మా అందరికీ గురు సమానులు గౌతమ్ రాజు గారు ఎడిటర్‌గా చేశారు. ట్రైలర్లో హీరో శివ కంఠమనేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. అలాగే హీరోయిన్ క్యాథలిన్ గౌడ, మిగతా ఆర్టిస్టులు చక్కగా చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.




































