ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు కొన్ని చిత్రాలలోనే నటించినప్పటికీ, మంచి గుర్తింపు సొంతం చేసుకుని, ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తారనుకున్న టైమ్ లో ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అలా ఇండస్ట్రీకి దూరం అయిన హీరోయిన్లలో రేఖ ఒకరు. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలకు చాలా ఫేమస్ రేఖ. అప్పటి యూత్ తమకు ఇలాంటి ప్రేయసి ఉండాలి అని భావించేవారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రేఖ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారింది. రేఖ ఇలా అయిపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రేఖ ఆనందం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో యువతకు రేఖ మరింత చేరువైంది. ఆ మూవీ తరువాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రేఖకు అవకాశాలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో రేఖకు మంచి హిట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత రేఖ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె కొన్ని సినిమాలలో సైడ్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కు దూరం అయ్యింది.
చాలా రోజుల తరువాత రేఖ బుల్లితెర పై మెరిసింది. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాగా చిక్కిపోయింది. ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేఖ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొంది.ఆ షోలో రేఖ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అది సహజం, మన వృత్తిని చూసి అలా జరగవు. అయితే ఏం జరిగినా కూడా లైఫ్ లో ముందుకు వెళ్ళాలని, జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన లైఫ్ లో గుణపాఠం లాంటిది.
తనకు కొన్ని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చాయని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. అనుకోకుండా జరిగింది. అయితే చాలా మందికి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. చిన్నవి అయినా, పెద్ద వ్యాధి అయినా ఒత్తిడికి లోనవ్వద్దు. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు.













#2 చుట్టాలబ్బాయి
#3 పాండవులు పాండవులు తుమ్మెద
#4 పల్లకిలో పెళ్లికూతురు 




ఉపేంద్ర 90లలో ఓం, ఎ, ఉపేంద్ర, రా లాంటి సినిమాలతో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగానూ ఉపేంద్ర వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర డైరెక్షన్ లో మూవీ అంటే టేకింగ్, కథాకథనాలు ఆడియెన్స్ అంచనాలకు అందని రేంజ్ లో ఉంటుంది. ‘ఉపేంద్ర’ మూవీతో తెలుగులో హిట్ అందుకుని భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉపేంద్ర, గత 20 ఏళ్ళలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అయితే చాలా విరామం తర్వాత ‘యుఐ’ అనే సినికు దర్శకత్వం చేస్తూ, నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను సెప్టెంబర్ 18న థియేటర్లో రిలీజ్ చేశారు. టీజర్ చూడడానికి వెళ్ళిన ఫ్యాన్స్ ఉపేంద్ర ఇచ్చిన షాక్ కి కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయారు. టీజర్ ప్లే చేయగానే ఒక్కసారిగా చీకటిగా మారింది. విజువల్ ఏం లేకుండా ఆడియో మాత్రమే వినిపించడంతో ముందుగా ఏదో టెక్నికల్ ఎర్రర్ అని భావించారు. కానీ టీజర్ అది అని గ్రహించడానికి టైమ్ పట్టింది.
అయితే గత కొద్దిరోజులుగా ఉపేంద్రపై కన్నడ ఇండస్ట్రీలో పదేళ్ల పాటు సినిమాలు చేయకుండా నిషేధం విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఉపేంద్ర సినిమా తరువాత ఆయన డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. దాంతో ఉపేంద్రను బ్యాన్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ఉపేంద్ర, నటన వైపు వెళ్లాలనే ఉద్దేశ్యంతో డైరెక్షన్ కు దూరంగా ఉన్నట్టు తెలిపారు.
సింహా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ నటించిన మూవీ లెజెండ్. ఈ మూవీ 2014 లో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై ఆచంట గోపిచంద్, ఆచంట రామ్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. కొర్రపాటి సాయి సమర్పించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి త్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నాంది అవార్డ్ వచ్చింది.
ఈ రెండు సినిమాలలో ఆనంద్ రాజ్ అనే యాక్టర్ నటించాడు. సింహా సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా నటించాడు. ఈ నటుడి పేరు ఆనంద్ రామరాజు. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో జన్మించారు. తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అక్కడే పూర్తి చేశాడు. నటన పై విపరీతమైన ఆసక్తి ఉన్న రామరాజు 2003లో సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు.
ఆనంద్ రామరాజు 2004 లో ఆరుగురు పతివ్రతలు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రు. ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆ తరువాత గౌతమ్ SSC, పోకిరి, సింహా, నేనింతే, లెజెండ్, లౌక్యం, ఆగడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించాడు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్‌లో నటించిన రామరాజు తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు.
గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. గత కొద్దిరోజులుగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీల, మెయిన్ హీరోయిన్ అవగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తీసుకున్నారని తెలుస్తోంది. జగపతి బాబు ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. నాన్ స్టాప్ గా షూటింగ్ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. మహేష్ బాబు తల్లిగా ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరితో నటించిన రమ్యకృష్ణ, కొన్నేళ్ళ నుండి హీరోలకు తల్లిగా, కీలక పాత్రలలో నటిస్తోంది. ఇటీవల జైలర్ మూవీలో రజినికాంత్ భార్యగా నటించింది. రమ్యకృష్ణ ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లిగా నటిస్తోంది. అయితే వీరిద్దరు ఇంతకు ముందు ‘నాని’ మూవీలో కలిసి నటించారు. మళ్ళీ 19 ఏళ్ల తరువాత గుంటూరు కారంలో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోని కుటుంబం చెన్నైలోని డిడి కే రోడ్ లో నివసిస్తుంది. విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు మీరా ఆంటోనీ, లారా ఆంటోని. పెద్ద కుమార్తె మీరా వయసు 16 సంవత్సరాలు. ఆమె చర్చ్ పార్క్ హై స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈమె ప్రయాణం తీసుకోవడానికి కారణం డిప్రెషన్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆమె గత కొద్దిరోజులుగా డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుందని అంటున్నారు.
గారాల కుమార్తె మీరా దూరం అవడం హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోతున్నాడు. పిల్లలే లోకంగా బ్రతికే తండ్రి, వారిలో ఒకరు శాశ్వతంగా దూరం అయితే కలిగే దుఖాన్ని ఎవరూ ఓదార్చలేరు. కుమార్తె మీరాతో పాటు తాను కూడా చనిపోయానని విజయ్ ఆంటోనీ చేసిన ట్వీట్ అందరి హృదయాలను కలిచివేస్తోంది. తన జీవితంలో ఎన్నో కోల్పోయిన విజయ్ ఆంటోని ఇప్పుడు కుమార్తెను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నాడు.
తన కుమార్తె మీరా ఆంటోని అడిగిన ఆఖరి కోరికను తీర్చలేకపోయానని ఆయన చాలా బాధపడుతున్నారట. మీరా థాయిలాండ్ కు తీసుకువెళ్లమని కోరిందంట. అయితే విజయ్ ఆంటోనీ బిజీ షెడ్యూల్స్ వల్ల తీసుకెళ్లలేకపోయాడట. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మరింతగా విజయ్ బాధపడుతున్నారు.

