టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ నిలబెట్టిన మూవీ బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా నటించి మెప్పించారు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ మూవీతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అమరేంద్ర బహుబలి వ్యాక్స్ విగ్రహాన్ని లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ మ్యూజియంలో పెట్టిన మైనపు విగ్రహాం పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మండిపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాహుబలి సినిమా అంతర్జాతీయంగా పలు దేశాలలో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించగా, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్లుగా అనుష్క, తమన్నా నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ లోని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ మైనపు బొమ్మకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ‘బాహుబలి’ విగ్రహంలో ప్రభాస్ పొలికలు లేకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలింగ్ నేపథ్యంలో ఈ విగ్రహం పై నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. అందులో “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. మా అనుమతి లేకుండా చేశారు. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!

ప్రస్తుత కాలంలో ఎవరు, ఎప్పుడు సెలెబ్రెటీగా మారుతారో చెప్పలేము. సోషల్ మీడియా ప్రస్తుతం పాపులర్ అవ్వడానికి ఒక మార్గంగా మారిందని చెప్పవచ్చు. ఫేమస్ అవడానికి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎవరికి కున్న ప్రతిభను వారు వీడియోల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ వీడియోలు, కొందరు, వంటల వీడియోలు, పాటలు పాడినావి, డ్యాన్స్ వీడివలు పెడుతున్నారు.
కొందరు వారి వీడియోలను ట్రోల్ చేయడం వల్ల కూడా ఫేమస్ అవుతున్నారు. మరికొందరు వేరే వారు పాడుతుండగా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడంతో చాలామంది పాపులర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లో పాట పాడే రాను మోండల్ పాటలు పాడుతూ జీవిస్తున్న ఆమె వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారడంతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యి, సెలబ్రిటీగా మారింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో కలిసి పని చేసే అవకాశం పొందింది.
తాజాగా ఒక క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నృత్యం చేసిన డ్యాన్సర్ అభినయానికి, డ్యాన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. లెజెండ్స్_స్టూడియో అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్లాసికల్ డ్యాన్సర్ శ్రియా హనుమంతు హవభావాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ పొందింది. శ్రియా హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నాట్యాన్ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.





అభి నక్షత్రం, అనుమోల్, మదన్ కీలకపాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి ముత్తు కుమార్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్లగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, తమిళనాడులో ఉండే వీరపన్నై అనే ఊరి గ్రామ దేవత అయలీ. ఆ దేవతను రజస్వల కాని అమ్మాయిలు మాత్రమే దర్శించుకోవాలనే నియమం ఉంటుంది. ఆ ఊరి అమ్మాయిలకు రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని, అమ్మాయిలు అంతగా చదువుకోకూడదనే కట్టుబాట్లు ఉంటాయి.
అయితే ఈ కట్టుబాట్లు పాటించకుండా, ప్రేమించిన వ్యక్తితో ఒక అమ్మాయి పారిపోవడంతో దేవత ఆగ్రహించి ఆ ఊరిని నాశనం చేసిందనుకున్న ఆ గ్రామస్థులందరు వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. ఆ గ్రామస్థుల ఒక ఊరిని నిర్మించుకుని, అందులో అయలీ దేవత గుడిని నిర్మించి, తమ ఆచారాల్ని మళ్ళీ కొనసాగిస్తుంటారు. అయితే ఆ గ్రామాంలోని యళిల్ (అభి నక్షత్ర) డాక్టర్ కావాలని కలలు కంటుంది. ఆమె టెన్త్ క్లాస్ వరకు ఎలా చదువుకుంది? ఆమె కల నెరవేరిందా? లేదా? ఆమె ఊరి ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది? అనేది మిగిలిన కథ.
మొదటి నుంచే యళిల్ పాత్ర పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానిని దర్శకుడు అలానే కొనసాగిస్తూ ఆమె పోరాటాన్ని తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అభి నక్షత్ర యళిల్ క్యారెక్టర్ లో జీవించింది. స్టోరీని ఆ పాత్రే ముందుకు నడిపించింది. అనుమోల్, సింగంపులి, మదన్, టీఎస్ ధర్మరాజు, లింగా వంటివారు తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. రెవా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హత్తుకుంటుంది. రామ్జీ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.



రేఖ ఆనందం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో యువతకు రేఖ మరింత చేరువైంది. ఆ మూవీ తరువాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రేఖకు అవకాశాలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో రేఖకు మంచి హిట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత రేఖ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె కొన్ని సినిమాలలో సైడ్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కు దూరం అయ్యింది.
చాలా రోజుల తరువాత రేఖ బుల్లితెర పై మెరిసింది. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాగా చిక్కిపోయింది. ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేఖ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొంది.ఆ షోలో రేఖ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అది సహజం, మన వృత్తిని చూసి అలా జరగవు. అయితే ఏం జరిగినా కూడా లైఫ్ లో ముందుకు వెళ్ళాలని, జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన లైఫ్ లో గుణపాఠం లాంటిది.
తనకు కొన్ని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చాయని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. అనుకోకుండా జరిగింది. అయితే చాలా మందికి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. చిన్నవి అయినా, పెద్ద వ్యాధి అయినా ఒత్తిడికి లోనవ్వద్దు. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు.











#2 చుట్టాలబ్బాయి
#3 పాండవులు పాండవులు తుమ్మెద
#4 పల్లకిలో పెళ్లికూతురు 



