వరల్డ్ వైడ్ గా పూనకాలు పుట్టించిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మొదటి భాగంపై మంచి రెస్పాన్స్ రాగా… రెండో భాగానికి ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ సైతం బద్దలు అయ్యేలా కలెక్షన్స్ రాబట్టింది.
ఈ నేపథ్యంలో పార్ట్ -3 పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మేరకు ప్రాజెక్టు త్రీ బై ప్రశాంత్ నీల్ కసరత్తులు మొదలుపెట్టారు. ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా జపాన్ లో విడుదల చేయక అక్కడ కూడా భారీ కలెక్షన్లు కాబట్టి విజయకేతనం ఎగరవేస్తుంది.

మొత్తంగా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. అందుకే కేజిఎఫ్ పార్ట్ 3 పై భారీ అంచనాలు పెరిగాయి. కానీ యష్ సినిమా తీయాలంటే కొన్ని ఆంక్షలు పెట్టాడు. యష్ కి కే జి ఎఫ్ మూవీ తో భారీగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. కాబట్టి పార్ట్-3 అంతకుమించి ఉంటేనే తీస్తాను అని యష్ అన్నాడట. పార్ట్ 3 కథ ముందు యష్ కు నచ్చినప్పుడే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే ఉన్న అభిమానులను మరింత పెంచుకోవాలని అందుకే పార్ట్ త్రి పై ఎటువంటి ఆంక్షలు విధించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పార్ట్-3 చిత్రీకరణ మొదలుపెట్టే కంటే ముందు ఇతర దేశాలలో కూడా ఈ సినిమా విడుదల చేయాలని చెప్పాడట. ఇదిలా ఉంటే ఇప్పటికే యష్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేని భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు కేజిఎఫ్ పార్ట్ 3 కంటే ముందు అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ సినిమా త్వరలోనే పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యష్ కేజిఎఫ్ పార్ట్ 3 ఒక రేంజ్ లో ఉండబోతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక యష్ నటిస్తున్న కొత్త సినిమాపై ఉత్కంఠ నెలకొంది.
ALSO READ : OTT లో విజృంభణ సృష్టిస్తున్న విమానం మూవీ..!









శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



























హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ప్రాధాన్య సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన ఐశ్వర్య సొప్పన సుందరి సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఒక బంగారు షాపులో పని చేస్తుంటుంది. ఆమెకు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, నాన్ స్టాప్ గా మాట్లాడే తల్లి, మాటలు రాని అక్క ఉంటారు. అన్నయ్య దొర(కరుణాకరన్) ప్రేమించి, పెళ్లి చేసుకుని వారికి దూరంగా వెళతాడు.
ఆ ఫ్యామిలీకి రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా అప్పులు ఉండడడంతో కష్టంగా వారి జీవితం సాగుతుంటుంది. అలాంటి వాళ్ళకు ఒకరోజు హఠాత్తుగా ప్రముఖ నగల స్టోర్ లో తీసిన బంపర్ డ్రాలో పది లక్షలు విలువ చేసే కారు వస్తుంది. ఆ తరువాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వారి జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? దొర అతని బావ కలిసి ఏం చేశారు? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా కథ.
అహల్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ పాత్రలో ఒదిగిపోయింది. మూవీ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆకట్టుకుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, థ్రిల్ కు గురి చేస్తూ కామెడీ పండించే విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ మూవీ చూసినంతసేపు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు.