మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘బ్రో’ తో ఆకట్టుకున్నాడు. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత చేసిన రెండు చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బ్రో మూవీ సక్సెస్ సెలబ్రేషన్ వేడుకల్లో పాల్గొంటూనే, తన స్నేహితులతో కలిసి నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు.
ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న సాయిధరమ్ తేజ్ ఫోటోలు రెండు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాయిధరమ్ తేజ్ తో పాటుగా ఈ ఫోటోలో ఉన్న మరొక వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన, ప్రముఖ నటుడి కుమారుడిలా కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరో? ఆ ప్రముఖ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
‘బ్రో’ మూవీ తరువాత సాయిధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కన్నా ముందుగా సాయిధరమ్ తేజ్ ఒక షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సాయిధరమ్ తేజ్ చాలా కాలం క్రితమే ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాడు.
ఈ షార్ట్ ఫిల్మ్ కి యాక్టర్ సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ డైరెక్షన్ చేశాడు. నవీన్ నందిని నర్సింగ్ హోమ్, ఐనా ఇష్టం నువ్వు, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రాలలో హీరోగా నటించాడు. వీటిలో ఐనా ఇష్టం నువ్వు మూవీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం. అయితే నవీన్ నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దాంతో నటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను గుర్తు పట్టలేనంతగా, లావుగా మారిపోయారు.
ఇక వైరల్ అవుతున్న సాయిధరమ్ తేజ్ ఫోటోలో అతని పక్కన నలుపు రంగు టీషర్ట్‌లో ఉన్నది నవీన్. అతను లావుగా మారడంతో వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్, నవీన్, సాయితేజ్ మంచి స్నేహితులు. వీలు దొరికినపుడల్లా ఈ ముగ్గురు కలుస్తుంటారని తెలుస్తోంది. నవీన్ హీరోగా సక్సెస్ కాలేకపోయినా, డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది అని తెలుస్తోంది.
Also Read: “తల ఏదో తేడాగా ఉందేంటి..?” అంటూ… చంద్రముఖి-2 నుండి “రాఘవ లారెన్స్” పోస్టర్‌పై 15 ట్రోల్స్..!

హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని, నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. అలా వచ్చిన వెబ్ సిరీస్ ‘సుడల్’. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్లుగా రూపొందింది. దీనిని తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయాని వస్తే, షణ్ముగం(పార్తిబన్) చాలా కాలం నుంచి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. ఆ ఫ్యాక్టరీలో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన రోజే షణ్ముగం యొక్క చిన్న కుమార్తె నీలా కనిపించకుండా పోతుంది. ఫైర్ యాక్సిడెంట్ మరియు కనిపించకుండా పోయిన నీలా కేసులను సాల్వ్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ రెజీనా(శ్రీయ రెడ్డి), చక్రి(కాథిర్) లను నియమిస్తుంది. ఈ కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు తెలిసిన షాకింగ్ విషయాలు ఏమిటి?
నీలా ఎందుకు మిస్ అయ్యింది? వారు ఈ కేసులను సాల్వ్ చేశారా లేదా అనేది మిగతా కథ. రొటీన్ స్టోరీ అయినప్పటికీ, గ్రిప్పింగ్ నరేషన్, ఇంటెన్స్ కథనంతో ఈ సిరీస్ ని తీర్చిదిద్దిన విధానం, ఆడియెన్స్ కి థ్రిల్ ని కలిగిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో కీలకమైన ట్విస్టులు, ప్రతి క్యారెక్టర్ యొక్క క్యారక్టరైజేషన్ కూడా ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఈ సిరీస్ నిడివి ఎక్కువగా ఉండడం వల్ల సాగదీసిన భావన కలుగుతుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్ శ్రీను ఈ విషయం గురించి చెప్పారు. తాను మగధీర చిత్రంలో చిరంజీవికి డూప్ గా నటించానని వెల్లడించారు. అప్పట్లో హీరో ప్రభాస్ గారి ఇంట్లో రాత్రి 3 వరకు వాలీబాల్ ఆడుతుండేవాళ్ళమని అన్నారు. ఆ టైమ్ లోనే డైరెక్టర్ రాజమౌళి కాల్ చేసి మగధీర మూవీలో అవకాశం ఇచ్చారని తెలిపాడు.
చిరంజీవి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కొన్ని షాట్స్ ను తనపై తీశారని చెప్పాడు. ఆ చిత్రంలో మెగాస్టార్ వేసుకున్న డ్రెస్, నా డ్రెస్ ఒకటేనని, చిరంజీవి గారు సెట్ లోకి వస్తుంటే తాను పారిపోయేవాడినని వెల్లడించారు. ఆ డ్రెస్ ను దాచుకోవాలని అనుకున్నానని తెలిపారు. అయితే ఆ డ్రెస్ మళ్ళీ దొరకలేదని వెల్లడించారు.
ప్రభాస్ శ్రీను చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో చర్చకు దారి తీసాయి. ప్రభాస్ శ్రీను చిరంజీవికి డూప్ గా నటించారని తెలిసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ప్రభాస్ శ్రీను టాలీవుడ్ లో కమెడియన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభాస్ శ్రీను పారితోషికం భారీగా తీసుకుంటాడని తెలుస్తోంది.
అజిత్ మాత్రమే కాదు , ఆయన కుమారుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మొదటి స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది తెగింపు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్, చాలా సాధారణంగా ఉంటారు. స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి బేజషాలకు పోకుండా నిరాడంబరంగా జీవిస్తారు.
అజిత్ తన సినిమాలను ప్రమోట్ చేయడు. అతనికి ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. తన లేదా అతని కుటుంబం యొక్క ఫోటోలను షేర్ చేయడు. అజిత్ కుమార్ హీరోయిన్ శాలినిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ఇద్దరు పిల్లలు, కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్. స్టార్ డమ్ ఉన్నప్పటికీ, ఈ కుటుంబం మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ, వారి తండ్రిలాగే, అజిత్ పిల్లలు ఇద్దరూ కూడా పాపులర్ అయ్యారు.
ఆద్విక్ని ‘కుట్టి థాలా’ అని అభిమానులు పిలుస్తారు. ఇది హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్ గా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. ఇది సిని నేపథ్యం ఉన్న ఫ్యామిలిలో చిన్న వయస్సులో ట్విట్టర్లోకి ట్రెండ్ అయిన మొదటి అబ్బాయిగా ఆద్విక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2021లో జనవరి 27న 22.4K రీట్వీట్‌ను అందుకున్నాడు.
జీవితంలో ప్రధానమైన ప్రేమ, ఆత్మాభిమానం వంటి అంశాలను కమ్ముల వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. భారీ తారాగణం లేకుండా, ఎక్కువగా కొత్తవాళ్ళతో, సాదాసీదా కథనంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం అందుకుంది. ఈ చిత్రంలో రాజా, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. హీరోయిన్ కమలిని ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోయి, స్నేహితుల సహాయంతో జీవితాన్ని కొనసాగించే రూప పాత్రలో జీవించి, విమర్శకుల, ఆడియెన్స్ ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుని, అటు అమ్మకు, ఇటు కాబోయే భార్యకు నచ్చచెప్పే పాత్రలో నటించిన నటుడి పేరు అనుజ్ గుర్వారా. ఇతను నటుడు మాత్రమే కాదు నేపథ్య గాయకుడు, వాయిస్ ఆర్టిస్ట్, రేడియో జాకీ మరియు టెలివిజన్ షో హోస్ట్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన మగధీర సినిమాలో పంచదార బొమ్మ బొమ్మ పాటను అనుజ్ పాడారు.
ఈ పాటకు గాను అతను ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కాకుండా ఎన్నో తెలుగు హిట్ సాంగ్స్ ను ఆలపించారు. వాటిలో బద్రీనాథ్, వేదం, భీమిలి కబడ్డీ జట్టు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, ప్రేమ కావాలి వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. హిందీలో కూడా పలు సాంగ్స్ ను ఆలపించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనుజ్ గుర్వారాకు ఇన్ స్టాగ్రామ్ లో 5 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.








సూపర్‌స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ‘చంద్రముఖి’ సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలలో చంద్రముఖి మూవీ ఒకటి.
ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే దర్శకుడు సీక్వెల్ ను తీస్తున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో వెంకటపతి రాజు గెటప్‌లో లారెన్స్ కనిపించారు. పోస్టర్ లో లారెన్స్ తల పెద్దగా, బాడీ చిన్నగా, ఉండటంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ పై పలు మీమ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
2.
3.
4.
5.
7.
9.
11.
13.



18.
‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.
ఓటీటీలో రిలీజ్ అయిన 40 గంటల్లోనే 100 మిలియన్లకి పైన స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసిన సినిమాలలో ఒకటి నిలిచింది. అయితే ఈ మూవీ క్లిపింగ్ ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ అక్క పెళ్లి గురించి ఇరు ఫ్యామిలీలు మాట్లాడే సన్నివేశంలో నరేష్ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ హీరోయిన్ తండ్రి శ్రీకాంత్ అయ్యంగార్ నరేష్ తో మాట్లాడుతూ ఉంటాడు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీరి వెనకాల ఇద్దరు క్యారెక్టర్ ఆర్తిస్టులు నలుపు చీర కట్టుకున్న మహిళ, ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్న మహిళ ఇటు నరేష్ మాట్లాడుతున్నప్పుడు వెనకాలే ఉంటారు. అటు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతున్నప్పుడు అటు వైపు కూడా కనిపిస్తారు. ఇది గమనించిన ఒక నెటిజెన్ ఈ వీడియో క్లిపింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వారిద్దరూ ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా ఉన్నారు కదా అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజెన్లు ఈ పోస్ట్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.