2009 బాణం మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నారా రోహిత్. డిఫరెంట్ కంటెంట్ తో, ఆలోచింపచేసే కథనంతో వెరైటీ మూవీస్ చేసే నారా రోహిత్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 2018 తర్వాత నారా రోహిత్ నుంచి మరొక సినిమా అప్డేట్ ఇంతవరకు రాలేదు.
ఈ నేపథ్యంలో త్వరలో ప్రతినిధి 2 మూవీతో అతను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయాలలో బాగా బిజీగా ఉన్న నారా రోహిత్ ఇప్పుడు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు.

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎంతో యూత్ ఫుల్ గా ఉండే రోహిత్ ఇప్పుడు ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు. జూలై 25న నారా రోహిత్ జన్మదిన సందర్భంగా ఆయన బంధువులు, అభిమానులు మరియు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు తెలుగు రాష్ట్రాలలోని నారా రోహిత్ అభిమానులు ఆరోజున పలు దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు అనాధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలను జరిపారు.

2014లో నారా రోహిత్ హీరోగా విడుదలైన ప్రతినిధి చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రతినిధి 2 2024 జనవరి 25వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నిన్ను అనౌన్స్ చేయడం జరిగింది.

వానర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంకు సంబంధించిన మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. ఒక సామాన్యుడు ఏకంగా ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేసి దేశంలోని విధివిధానాలను మార్చే డిమాండ్లు చేయడం ముఖ్య కథగా సాగిన ప్రతినిధి చిత్రం ఈసారి పొలిటికల్ కంటెంట్‌తో రాబోతోంది. ఈ చిత్రం కూడా మొదటి చిత్రం లాగా సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ALSO READ : సాలిడ్ మూవీతో లాంచ్ కాబోతున్న నందమూరి నట వారసుడు..! డైరెక్టర్ ఎవరంటే..?






తరుణ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘అశ్విన్స్’. ఈ మూవీని విరూపాక్ష ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై నిర్మించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) ఇద్దరు భార్యభర్తలు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, గ్రేస్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. ఈ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం పైన ఒక ఎపిసోడ్‌ను షూట్ చేయడం కోసం లండన్‌లో ఒక దీవిలో ఉండే బంగ్లాలోకి వెళ్తారు.
ఆ బంగ్లాలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ ఉందని, అక్కడి వెళ్లిన 15 మందిని చంపిందనే ప్రచారం ఉంటుంది. అర్జున్ టీమ్, ఆ బంగ్లాలో తిరిగే ఆత్మలను, అరుపులను కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఆ బంగ్లాలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఏంటి? ఆర్తి రాజగోపాల్ ఎలా మరణించింది? అసలు ఆ బంగ్లాలో ఏముంది? అశ్వినీ దేవతలు ప్రసాదించిన బొమ్మలు కనుగొన్న ఆర్తి రాజగోపాల్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనవాళ్లను రక్షించుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అనేది ‘ఆశ్విన్స్’ కథ.
మంచి, చెడు రెండింటినీ నియంత్రించే శక్తి మనిషికి మాత్రమే ఉందనే మెసేజ్ ను ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించారు. దర్శకుడు తరుణ్ తేజ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని స్క్రీన్ పై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అశ్విన్స్ మూవీ హారర్ మరియు మైథాలజీ కలిపి తెరకెక్కించిన ఒక డిఫరెంట్ సినిమా. హారర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.





తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నప్పటికీ బేబీ మూవీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యాబై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్‌తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘బేబి’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఫిదా అవుతున్నారు.
ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.
హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్‌ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్‌లో విరాజ్ సన్నివేశాన్ని తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.
కన్నడ సినిమా స్థాయి ఏమిటనేది కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ కేజీఎఫ్ 2 మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టి కన్నడ చిత్రాల వైపు మరలింది. కేజీఎఫ్ చిత్రాలతో పాటుగా కాంతార, విక్రాంత్ రోణ, కిరిక్ పార్టీ, చార్లీ 777, వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచాయి. వాటి ద్వారా కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగింది. అయితే ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు.
చాలా రోజుల తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాతో కన్నడ ప్రేక్షకులు ఊరట పొందారు. జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యువతకి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ కావడంతో యూత్ ఎగబడి సినిమాని చూస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీతో నితిన్ కృష్ణమూర్తి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. హీరో రక్షిత్ శెట్టి, ఒకప్పటి హీరోయిన్ రమ్య, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిలు అతిథి పాత్రలలో నటించారు. ‘కాంతార’ మ్యూజిక్ డైరక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీని తన సంగీతంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఇక ఈ కథ విషయనికి వస్తే, హాస్టల్ లో ఉండే యువకుల మధ్య సాగే కథ ఇది. అయిదుగురు కుర్రాళ్ళు హాస్టల్ లో ఒకే గదిలో ఉంటారు. అయితే అందులో ఒకరికి షార్ట్ ఫిల్మ్ ను తీయాలని అనుకుంటాడు. కానీ వారికి ఎగ్జామ్స్ ఉండటంతో మిగిలిన నలుగురు అందుకు ఒప్పుకోరు. ఆ టైమ్ లోనే హాస్టల్ వార్డెన్ మరణిస్తాడు. కానీ తన చావుకు ఈ అయిదుగురు కుర్రాళ్ళే కారణం అని ఒక లెటర్ రాసిపెట్టి చనిపోతాడు.
ఈ విషయం తెలిసి షాక్ అయ్యి, అందులో నుండి బయటపడడానికి సీనియర్ ను సాయం అడుగుతారు. ఆ తరువాత ఏం జరిగింది? అందులో నుండి అయిదుగురు కుర్రాళ్ళు బయటపడ్డారా? ఆ వార్డెన్ లెటర్ లో వీళ్ళే కారణం అని ఎందుకు రాశాడు? అనేది మిగతా కథ. దర్శకుడు ఈ మూవీ స్క్రీన్ ప్లేను సరదాగా నడిపించారు.



