సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు. తనకన్నా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ వంటివారిని బీట్ చేసి, అనిరుధ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అనిరుధ్ పాటలకు మాత్రమే కాకుండా ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
బాలీవుడ్ మూవీ జవాన్ కి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ప్రివ్యూకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి అనిరుధ్ అందుకున్న రెమ్యూనరేషన్ గురించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు చార్ట్ బస్టర్ పాటలను అనిరుధ్ రవిచందర్ అందించారు. పవన్ కళ్యాణ్ నటించిన “అజ్ఞాతవాసి” మూవీతో తెలుగువారికి కూడా పరిచయమయ్యారు. కానీ ఆ మూవీలో పాటలతో పెద్దగా మెప్పించలేకపోయారు. ఆ తరువాత నాని నటించిన “గ్యాంగ్ లీడర్” మూవీతో ఒకే అనిపించాడు. ఇక జెర్సీ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్న అనిరుధ్, తాజాగా మూడు పెద్ద సినిమాలకు సైన్ చేశారని తెలుస్తోంది.
అనిరుధ్ ప్రస్తుతం షారుక్ ఖాన్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొనే వంటి వారు నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం మూవీ పై అంచనాల కన్నా, ఈ మూవీ కోసం అనిరుధ్ అందుకుంటున్న పారితోషికం పైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఎందుకంటే జవాన్ మూవీకి అనిరుధ్ రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది.
భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన ఒక మూవీకి దాదాపు రూ.8 కోట్లు పారితోషికం అందుకుంటాడు. అయితే ఇప్పుడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ ను కూడా మించిపోయాడు. అనిరుధ్ రెమ్యూనరేషన్ విషయాన్ని బాక్సాఫీస్ వరల్డ్‌వైడ్ రిపోర్ట్ తెలిపింది. అనిరుధ్ జవాన్ తో పాటుగా లియో, జైలర్, ఇండియన్ 2 వంటి చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.










#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
1. బేబీ:
2. ఆర్ ఎక్స్ 100:
3. డిజే టిల్లు:
4. రారండోయ్ వేడుక చూద్దాం:
5. మన్మధ:
6. నీవెవరో:
7. వల్లభ:
8. శుభలగ్నం:
9. ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు:
10. ప్రేమించాను నిన్నే:
11. ధర్మయోగి:
12. గుండెల్లో గోదారి:
13. బస్ స్టాప్:
14. సూర్య వంశం:
రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై 2011లో మీడియా సమావేశంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సేకరించిన బ్లడ్ ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై చిరంజీవి బావ మరిది అయిన అల్లు అరవింద్ అప్పట్లోనే రాజశేఖర్, జీవిత చేసిన విమర్శలు చేసినందుకు కోర్టును ఆశ్రయించారు.
చిరంజీవి పేరిట నడుస్తున్న ట్రస్టు, సేవా కార్యక్రమాల పై తప్పుడు ఆరోపణలు చేసారని పరువు నష్టం కేసు వేశారు. ఎన్నో సంవత్సరాల విచారణ తరువాత మంగళవారం నాడు నాంపల్లి 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు రాజశేఖర్, జీవితలకు సంవత్సరం జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసు పై అప్పీలుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చింది.
ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినపుడు రాజశేఖర్, జీవితలు మెగాస్టార్ చిరంజీవి పై ఎన్ని విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అప్పుడు చిరు అభిమానులు కొందరు ఆ విమర్శలను తట్టుకోలేక వారిపై దాడి చేయడం జరిగింది. తన ఫ్యాన్స్ దాడి చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి ఇంటికి వెళ్లి, క్షమించమని కోరిన విషయం కూడా తెలిసిందే.










బేబీ కల్ట్ బ్లాక్‌బస్టర్ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, నాగబాబు, నిర్మాత రవి శంకర్ లు హాజరు అయ్యి, మూవీలో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ బేబీ మూవీ విషయంలో ఒక హీరో తనను అవమానించిన సంగతిని బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ, బేబీ మూవీ కథను ఒక హీరోకు చెప్పాలనుకుంటే ఆ దర్శకుడు అయితే స్టోరీ కూడా వినని ఆ హీరో అవమానించాడని, అలాంటి సమయంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తనను నమ్మి మంచి మూవీకి డైరెక్టర్ ను చేశారు. ఎస్.కె.ఎన్ తనను నమ్మి ఇంత ఖర్చు పెట్టాడు. దర్శకుడు మారుతిగారు మా కన్న ఎక్కువగా మూవీ పై నమ్మకం ఉంచారని చెప్పారు.
ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి చిత్రాలే తెరకెక్కిస్తానని మాటిస్తున్నానని వెల్లడించారు. అయితే కథ వినకుండానే బేబీ మూవీని మిస్ చేసుకున్నహీరో ఎవరని నెటిజెనలు సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ హీరో ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరనే విషయాన్ని సాయి రాజేష్ లేదా ఆ హీరో కానీ రివీల్ చేస్తారేమో చూడాలి.



