ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఎంట్రీ ఇవ్వడం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ చాలా సందర్భాలలో అలా వచ్చినప్పటికీ నిలబడడం ఎంతో కష్టం అవుతుంది. ఇదే విషయం నార్నే నితిన్ విషయంలో కూడా జరుగుతుంది ఏమో అన్న అనుమానం అక్కడక్కడ వినిపిస్తుంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం పూజా కార్యక్రమం లాంఛనంగా ఈరోజు మొదలైంది.ఈ మూవీకి నిర్మాతలగా ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీ ద్వారా అంజిబాబు కంచిపల్లి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ రోజు చిత్రానికి సంభందించిన పూజ కార్యక్రమం అన్నపూర్ణ గ్లాస్ హౌస్‌లో జరిగింది. అయితే అతను నటిస్తున్న మొదటి చిత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. ముహూర్తం షాట్‌కి బడా నిర్మాత దిల్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చెస్తే…అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వడం జరిగింది. ‘కార్తికేయ 2’ మూవీ తో మంచి పాన్ ఇండియా సక్సెస్ సంపాదించిన డైరెక్టర్ చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ మూవీకి సంబందించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.అతను హీరోగా చేస్తున్న శ్రీ శ్రీ శ్రీ రాజా వారు దాని గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం కొత్తగా ప్రారంభమైంది.ఒకపక్క నితిన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం పై ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికి కూడా ఒక్క చిత్రం పూర్తి కాకపోవడం అందరిని కన్ఫ్యూజ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు అతని మొదటి చిత్రం ఏమిటి అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. కనీసం ఈ చిత్రమైన పూర్తి అవుతుందా లేక దీనికంటే ముందు మరో చిత్రానికి ముహూర్తం అనౌన్స్ చేస్తారా అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.






పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉందో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంలో క్లైమాక్స్ ముఖ్యమైన పాత్రను పోషించింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న బ్రో మూవీలో కూడా అత్తారింటికి దారేది మూవీ వంటి ఎమోషనల్ క్లైమాక్స్ ను త్రివిక్రమ్ పెట్టినట్టు తెలుస్తోంది. బ్రో మూవీ క్లైమాక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఉంటుందని సమాచారం. 2023 లో బ్రో మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే బ్రో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్రో మూవీకి అఖండ మూవీ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఊహించుకోవద్దని ఫ్యాన్స్ కు ఇంటర్వ్యూలలో ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. ఇక బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్రో మూవీతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు ఇప్పటిదాకా ఆరు మిలియన్ల వ్యూస్ లభించాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ముక్కోణపు ప్రేమకథ విజయం సాధిస్తుందని మూవీ యూనిట్, ట్రైలర్ ను చూసిన ఆడియెన్స్ భావిస్తున్నారు.
ఈ వీడియో చివర్లో ‘అమ్మాయిలు మనం ప్రేమించేటపుడు ఆధార కార్డ్ లో ఫోటోలా ఉంటారు. అదే మనం వదిలేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ లో మోడెల్స్ లా ఉంటారు’ అని చెప్తాడు. బేబీ ట్రైలర్ లో కూడా హీరోయిన్ ముందు డార్క్ మేకప్ లో ఉంటుంది. కాలేజీలో జాయిన్ అయిన తరువాత ఆమెలో మార్పు వస్తుంది. ఇది చూసిన నెటిజెన్లు “బేబీ” గురించి షణ్ణు అప్పుడే చెప్పేసాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వినోదయ సిత్తం తమిళ మూవీలో ప్రధాన పాత్రలో తంబిరాయమ్య నటించారు. కీలక పాత్రలో సముద్రఖని నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పరశురామ్ (తంబిరామయ్య) ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా 25 సంవత్సరాలుగా పనిచేస్తుంటాడు. అతను టైమ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అన్ని విషయాలను టైమ్ ప్రకారం చేస్తుంటాడు. భార్య, ఇద్దరు కూతుర్లు పరశురామ్ మాటను జవదాటరు. అతని కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.
ఇక ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని పాత్రని పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని టాక్. ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీలో తంబిరాయమ్యకు ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉంటారు. అంటే తెలుగు రీమేక్ లో కథలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది.
సమంత ప్రస్తుతం ఖుషి మూవీ మరియు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ రెండింటి చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. సమంత తన హెల్త్ గురించి ఓ సంవత్సరం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని భావించిందని కొన్నిరోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె నటించిన ఖుషి మూవీ సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.
ఖుషి నుండి రిలీజ్ అయిన ‘ఆరాధ్య’ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో ఆ పాటలోని ఒక సీన్ సమంత పై ట్రోలింగ్ కారణం అయ్యింది. ఈ పాటలో ఓ సీన్ లో విజయ్ దేవరకొండ తన కాలితో సమంత కుడి చేతి పై తాకినట్లుగా ఒక స్టిల్ ఉంది. ఈ స్టిల్ ను చూసిన కొందరు నెటిజన్స్, సమంత గతంలో ఒక మూవీ పై చేసిన ఓల్డ్ ట్వీట్ ని ఇప్పుడు బయటికి తీశారు.
ఆ ట్వీట్ లో సమంత ‘ఇంకా విడుదల కానీ ఓ మూవీ పోస్టర్ చూశాను. నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ పోస్టర్ మహేష్ బాబు నటించిన ‘నేనొక్కడినే’ మూవీ పోస్టర్ అని అప్పట్లో చాలామంది అన్నారు. అపుడు గుర్తు వచ్చింది నీకు, మరి నీ మూవీ టైమ్ కి గుర్తు రాలేదా అంటూ నేనొక్కడినే పోస్టర్ ని, ఖుషి ఫొటోని కూడా పక్కపక్కన పెట్టి మరి నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



