స్వాతంత్ర్యం రాక ముందు నుండి తెలుగు తమిళ భాషలలో మొదటి చిత్రాలను నిర్మించినది తెలుగువాడు హెచ్.ఎమ్.రెడ్డి. బ్రిటీష్ హయంలోని ఉమ్మడి మద్రాసు పట్టణం, అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. దాంతో దక్షిణాది భాషల సినిమాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే ఉండేది.
కానీ కొందరు తెలుగు నటీనటులు తెలుగు రాష్ట్రంలోనే తమ పరిశ్రమ ఉండాలని చేసిన ఎన్నో ప్రయత్నాల తరువాత ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరిలింపబడింది. అయితే ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు కృష్ణ, ఏఎన్ఆర్ మాట్లాడిన ఒక వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం టాలీవుడ్ కి సినిమాలు తీయడానికి దాదాపుగా అన్ని విధాల సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి. కానీ ఒకప్పుడు సినిమా తియ్యలి అంటే మద్రాసుకి వెల్లవల్సిందే. అక్కడ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతూ తెలుగువారు సినిమాలను చేసేవారు. అయితే ఎందరో చేసిన కృషి వల్ల ఇండస్ట్రీ హైదరాబాద్ కి రాగలిగింది. వారిలో ముఖ్యులు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, సారధి, రామానాయుడు వంటివారు హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించారు.
1983 జనవరి లో ఎన్టీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాదుకు తీసుకురావడంలో డి.వి.యస్.రాజు కీలక పాత్ర వహించారు. ఆయన సినీ రంగానికి, అభివృద్ధికి కావలసిన అన్నీ సహాయసహకారాలు అందజేశారు. అలా వచ్చిన ఇండస్ట్రీని ఒకప్పుడు పరిగణలోకి తీసుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియాలో అత్యధిక సినిమాలను నిర్మించే ఇండస్ట్రీలలో ఒకటిగా ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి రాకముందు హీరోలు కృష్ణ, ఏఎన్ఆర్ మాట్లాడిన వీడియో ఒకటి చకకర్లు కొడుతోంది. ఆ వీడియోలో కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావాల్సిందిగా కోరారు. మీ హయాంలోనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నా అంటూ ముగించారు.
ఆ తరువాత ఏఎన్ఆర్ మాట్లాడుతూ 1963 నుండి తెలుగు పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి జరుగుతోందని, కానీ ఇప్పటివరకు అది జరగలేదని, సీఎం ఎన్టీఆర్ సినీ ప్రపంచం నుండి వచ్చిన వారు కావడం వల్ల ఆయనను తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి తరలించాలని కోరడం సమంజసం అని, ఆయన సహకరించాలని అన్నారు.
watch video :
Also Read: “ఏజెంట్” OTT రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?



















సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రంలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. రిలీజ్ కు ముందు ట్రైలర్, టీజర్ లతో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఏజెంట్, థియేటర్లలో రిలీజ్ అయ్యాక పూర్తిగా నిరాశపర్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ అయిన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం పెట్టిన బడ్జెట్ లో కనీసం 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది.
ఏజెంట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన సోనీ లివ్ కొనుగోలు చేసింది. మే19 నుండి స్ట్రీమింగ్ చేయబోతునట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ఆ రోజు స్ట్రీమింగ్ కాలేదు. దాని పై సోనీ లివ్ ” ప్రస్తుతం ఏజెంట్ సినిమా అందుబాటులో లేదని, త్వరలోనే స్ట్రీమింగ్ అవనుంది” అని ట్వీట్ చేసింది. సినీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఏజెంట్ రిలీజ్ కి 2,3 రోజుల ముందు కూడా ఎడిటింగ్ పని జరిగిందట.
మూవీ ఔట్ పుట్ ఎలావుందో సరిగ్గా చూడకుండానే విడుదల చేయడం వల్లే ఫలితం నిరాశపరిచింది. కనీసం ఓటీటీలో అయినా రీ ఎడిట్ చేసి కాస్త బెటర్ ఔట్ పుట్ ను రిలీజ్ చేస్తే మళ్ళీ ట్రోలింగ్ బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. దాంతో ఈ మూవీని రీ ఎడిట్ చేసిన తరువాత ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.





తన నట ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో అనేక పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఒక పాత్రను ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ పాత్రలో నటించాలని ఎన్నో ఏళ్లు అనుకున్నారు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించిన కానీ ఆ పాత్రను చేయడం మాత్రం వీలుకాలేదు. అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం ఏర్పడేది. అలా ఆయన కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు. ఎన్టీఆర్ చేయాలనుకుని, చేయలేకపోయిన ఆ పాత్ర విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు.
అల్లూరి సీతారామరాజు కథతో ఒక చిత్రాన్నినిర్మించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. తోడు దొంగలు అనే చిత్రం తర్వాత ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అప్పటికే జయసింహ అనే చిత్రాన్ని ప్రకటించడంతో ఎన్టీఆర్ జయసింహ సినిమా తరువాత చేయాలని అనుకున్నారు. ఇక జయసింహ మూవీ పూర్తి అయ్యి రీలజ అవడం విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ సీతారామరాజు పాత్రలో నటించే చిత్రం ప్రారంభం అయినా వేరే కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది.
అయితే పాండు రంగ మహత్మ్యం మూవీ తర్వాత ఈ చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఆ టైం లో అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ లో కథానాయకకు చోటు లేకపోవడంతో పడాల రామారావు కథను మార్చాలని ఎన్టీఆర్ ను అడిగారు. ఇక ఆ తర్వాత శోభన్ బాబుతో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీయాలని ఒక సంస్థ అనుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఆ మూవీ వెనక్కు తగ్గింది.
అయితే అదే స్టోరీని సూపర్ స్టార్ కృష్ణ తీసుకోవడం, ఆ కథకు త్రిపురనేని మహారథి కొన్ని మెరుగులు దిద్దడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అల్లూరి సీతారామరాజు 100వ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం కృష్ణ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఎన్టీఆర్ కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని చూసిన తరువాత అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అనుకోలేదు. ఇక అల్లూరి సీతారామరాజు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనను ఎన్టీఆర్ ప్రశంసించారు. అయితే అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించనప్పటికీ, ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో కొన్ని చిత్రాలలో కనిపించారు.


చరిత్ర మరచిన కథలను, గుర్తుంచుకోదగిన కథలను తెలుగు చిత్రాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అలా జాతి గర్విం చే ఎందరో ప్రముఖులు వెండితెరపై కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్, నిఖిల్ ఓ మూవీని రెడీ చేయబోతున్నారు. చరణ్ ప్రొడ్యూసర్ గా నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ అనే చిత్రం రాబోతోంది. దీనికి సంబంధించి టైటిల్ ప్రకటన జరిగింది. ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
అసలు ఈ ఇండియా హౌస్ అంటే ఏంటి?
ది ఇండియన్ సోషియాలజిస్ట్ పేపర్ కటింగ్ లో ఉన్న వారు ఎవరు?
1905 విప్లవం:
అలా భారత్ నుంచి వచ్చి, ఇండియా హౌస్ స్కాలర్ షిప్ తో చదువుకునేవారిలో ఒక లా స్టూడెంట్ వీర్ సావర్కర్. 1906లో వీర్ సావర్కర్ ఇండియా హౌస్ కు స్కాలర్ షిప్ తో వచ్చి, మెల్లగా ఓ నాయకుడిగా మారిపోయాడు. ఆ కాలంలో ఇండియా హౌస్ లో బ్రిటీషు అధికారులు ఎక్కువగా సోదాలు నిర్వహించేవారు. అయితే సోషియాలజిస్ట్ పత్రిక ఎడిటర్ అయిన కృష్ణవర్మ ఎంతగానో ఇబ్బంది పడేవాడు.
బ్రిటీషర్లు తనను చంపేస్తారని భయపడిన కృష్ణవర్మ 1907లో పారిస్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ పత్రిక బాధ్యతను, ఇండియా హౌస్ బాధ్యతలను వీర్ సావర్కరే తీసుకున్నాడు. సోషియాలజిస్ట్ పత్రికను ముందుకన్నా ఎక్కువ తీవ్రతతో ప్రచురించడం మొదలు పెట్టాడు. నాస్తికుడైనా సావర్కర్ హిందూత్వ అజెండాతో పనిచేసేవాడు.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18