ఓ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నపుడే కచ్చితంగా దాని మీద మేకర్స్ కి ఓ అవగాహన అయితే వచ్చేస్తుంది. దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుందా కాదా అనేది అంచనా వేస్తారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఔట్ పుట్ చూసుకుంటే అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిపోతుంది. వారికున్న అనుభవం వారికి ముందుగానే సిగ్నల్స్ ఇస్తుంది.
అలాగే మన నట సింహం బాలయ్యకి కూడా ఒక సినిమా ఫలితం ముందుగానే తెలిసినా.. తప్పక ఆ చిత్రం చేశారట. అదే ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలయ్య కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. దాదాపు అన్ని కథలను ఆయన విని ఓకే చేసిన తర్వాతే బాలయ్య దగ్గరకు వెళ్లేవి. అప్పుడు కోదండరామి రెడ్డి దర్శకత్వంలో అన్నగారు ఓకే చేసిన కథతో బాలయ్య హీరోగా వచ్చిన ‘అనసూయమ్మ గారి అల్లుడు’ బ్లాక్ బస్టర్ అయింది.

దీంతో ఆయనతో మరో చిత్రం చెయ్యాలి అనుకున్నారు ఎన్టీఆర్. అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ దర్శకుడు కోదండరామిరెడ్డికి అస్సలు నచ్చలేదు. దాంతో అన్నగారికి కథ నచ్చలేదని.. ఇది చేస్తే ఫ్లాప్ అవుతుందని మొహం మీదే చెప్పేసాడు దర్శకుడు. మీకు నచ్చనపుడు సినిమా నేనెందుకు చేయమంటాను అంటూ ఎన్టీఆర్ కూడా సైలెంట్ అయిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఎందుకో తెలియదు కానీ ఆ కథతోనే సినిమా చేయాలని అన్నారంట ఎన్టీఆర్.

ఇక తప్పదని సినిమా చేసాడు కోదండరామి రెడ్డి. బాలయ్య కి కూడా ఈ సినిమా కథ నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో కోదండరామి రెడ్డి చెప్పాడు. ఎన్టీఆర్ కి ఎదురు చెప్పలేక ఇద్దరు అయిష్టం గానే చేసారు. అందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఒక షాట్ చేస్తున్నప్పుడు. వన్ మోర్ అని చెప్పాడు దర్శకుడు. ఎందుకండీ వన్ మోర్. ఎలాగూ ప్లాప్ అయ్యే సినిమానే కదా అన్నాడట బాలయ్య.

అనుకున్నట్లుగానే సినిమా విడుదల అయ్యింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం లో భానుప్రియ హీరోయిన్గా నటించింది. జీవిత చెల్లెలు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలోనే బాలయ్య మొదటిసారి బ్రేక్ డాన్స్ చేసాడు.


























స్టోరీ :
కొన్ని పరిస్థితుల వల్ల ఊళ్లోనే గౌరవంగా జీవించాలని నిర్ణయించుకున్న ముగ్గురు టెంట్‌హౌజ్ పెడతారు. అయితే టెంట్‌హౌజ్ అగ్నిప్రమాదంలో కాలిపోతుంది. దాంతో అప్పులు పాలవుతారు. వారు ఎలా అప్పు తీర్చారు. వాళ్ళు అనుకున్నట్లుగా ఊళ్ళో గౌరవంగా బ్రతికరా? అనేదే కథ.
సిరి రాశి తమ పాత్రలో పర్వాలేదనిపించుకుంది.శివ నందన్ లిప్‌స్టిక్ స్పాయిలర్ లింగంగా మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంజిమామ, మురళీధర్ గౌడ్ మూవీకి ప్రధాన ఎస్సెట్స్. వారి క్యారెక్టర్ల ద్వారా పండిన కామెడీని ఆడియెన్స్ బాగా ఆస్వాదిస్తున్నారు.
పాత్రలు మరియు కథ విషయంలో ఎక్కువ డెప్త్ లేకుండా చాలా సింపుల్ గా స్టోరి -కథనాన్ని రాసుకున్న తీరు బాగుంది. ఒకడు ఎదగాలి అని అనుకున్నప్పుడు చుట్టూ ఉండేవారు ఎలా సాయం చేస్తారనే విషయాన్ని పాజిటివ్ గా చూపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దూపాటి తక్కువ బడ్జెట్ సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫ్రేమింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తపడితే ఇంకా బాగుండేది.
ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సమకూర్చిన సాంగ్స్, నేపధ్య సంగీతం సరిగా పని చేయలేదు. పాటలతో పోలిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీని ఎలివేట్ చేయడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఒక గ్రామంలో చాలా సింపుల్ గా మూవీ మొత్తాన్ని తీశారు. దాంతో సహజత్వం ఎక్కడా మిస్ అవ్వలేదు.
































