ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలలో మరో హీరో నటించడం అనేది టాలీవుడ్ లో సాధారణం అని చెప్పవచ్చు. అయితే రిజెక్ట్ చేసిన మూవీ హిట్ అయితే ఆ హీరో ఎందుకు వదులుకున్నామా అని ఫిల్ అవుతుంటారు.
కానీ అదే సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా లేదా ప్లాప్ గా మిగిలితే మాత్రం వదులుకుని తమకు తాము మంచి చేసుకున్నామని ఫిల్ అవుతుంటారు. అయితే స్టార్ హీరోలు ప్లాప్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. ఏజెంట్:
ఇటీవల రిలీజ్ అయిన అక్కినేని అఖిల్ చిత్రం ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ స్టోరీని సురేందర్ రెడ్డి ముందుగా ప్రభాస్ కి వినిపించారంట.ఆయన రిజెక్ట్ చేయడంతో అఖిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
2. రామారావు ఆన్ డ్యూటీ:
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రవితేజ లాస్ట్ 7 చిత్రాలలో బాగా నిరాశ పరిచిన చిత్రం ఇదే. ఈమూవీ దర్శకుడు శరత్ మండవ ఈ కథను ముందుగా హీరో నాగర్జునకు చెప్పారంట. దానికి ఆయన ఈ మూవీ నా కన్నా వేరే హీరోలు సెట్ అవుతుందేమో అన్నాడంట. రవితేజకు సెట్ అవుతుందని చెప్పడంతో శరత్ ఈ కథను రవితేజకు చెప్పడం ఆయన నటించడం జరిగింది.
3. వినయ విధేయ రామ:
రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు. ఈ మూవీ రిజల్ట్ తరువాత రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ లెటర్ కూడా రాశారు. అయితే ఈ చిత్రాన్ని బోయపాటి ముందుగా ఆగడు మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారంట. మహేష్ నో చెప్పడంతో బోయపాటి రామ్ చరణ్ తో ఈ మూవీని పూర్తి చేశారు.
4. రభస :
కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు. ఈ సినిమాకి ముందుగా సంతోష్ శ్రీనివాస్ హీరో రామ్ తో కందిరీగ 2 ప్రకటించాడు. రామ్ రిజెక్ట్ చేశాడో లేదో కానీ ఆ తరువాత రభస మూవీ వచ్చింది.
5. స్పైడర్:
సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన స్పైడర్ ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ కి చెప్పారంట. స్టాలిన్ మూవీ టైం లో గోపీచంద్ మలినేని మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవారంట. ఆ టైం లో గోపీచంద్ ఈ స్టోరీని ఎంటర్ కి చెప్పారంట. అప్పుడు ఎన్టీఆర్ తనకు సెట్ అవకపోవచ్చని, మహేష్ కి అయితే సెట్ అవుతుందని అన్నారంట. మురుగదాస్ డైరెక్ట్ చేస్తే ఒకే అని మహేష్ అనడంతో ఈ మూవీ మొదలైంది.
6. నోటా:
గీతగోవిందం సినిమా తరువాత రిలీజ్ అవడంతో ఈ చిత్రం పై ఆడియెన్స్ భారీగా అంచనాలను ఏర్పరుచుకున్నారు. కానీ ఇది ప్లాప్ గా నిలిచింది. ఆనంద్ శంకర్ ముందుగా అల్లు అర్జున్ కి వినిపించారు. దానికి ఆయన సీఎం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తనకు సెట్ అవకపోవచ్చని అనడంతో విజయ్ దేవరకొండకు కథ వినిపించడం, ఆయనఆకు నచ్చి ఒకే చెప్పడం జరిగింది.
7. శ్రీనివాస కళ్యాణం:
ముందుగా ఎన్టీఆర్ కు చెప్తే సమయం కావాలని, ఆ తరువాత సమాధానం ఇవ్వకపోవడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సతీష్ రామ్ చరణ్ అనుకున్నారు కానీ చివరికి యంగ్ హీరో నితిన్ కి కథ వినిపించారు. నితిన్ కు కథ నచ్చడంతో ఇందులో నటించారు.
8. మిస్టర్:
శ్రీనువైట్ల చిత్రాలు ఆగడు మూవీ నుండి వరుసగా నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి.వాటిలో మిస్టర్ ఒకటి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా అల్లు అర్జున్ కి చెప్పారంట. అప్పటికే సన్ ఆఫ్ సత్యమూర్తి చితంలో నటించడంతో మరో క్లాస్ మూవీలో చేయడం ఇంటరెస్ట్ లేదని చెప్పారంట. దాంతో ఇందులో వరుణ్ తేజ్ నటించారు.
9. శాకుంతలం:
సీరియల్ అని పేరు తెచ్చుకున్న ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ముందుగా ఈ చిత్రంలో అనుష్క శెట్టి అనుకున్నారు.
కానీ ఆ తరువాత చివరికి సమంత నటించింది. ఈ మూవీ రిలీజ్ తరువాత అనేక విమర్శలు వచ్చాయి. దర్శకుడు గుణ శేఖర్ పై, సమంతను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
Also Read: ప్రముఖ నటుడు “శరత్ బాబు” కి సంతానం ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?











హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించారు. రామాయణం ఆధారంగా ఇప్పటికే అనేక చిత్రాలు రూపొందాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినపుడు ఆడియెన్స్ నుండి విమర్శలు చేశారు. ఇప్పటి దాకా వచ్చిన రామాయణం చిత్రాలను చూసిన ఆడియెన్స్ కి దర్శకుడు చేసిన మార్పులు అసలు నచ్చలేదు. టీజర్ యానిమేషన్లా ఉందనే ట్రోల్స్ వచ్చాయి. హిందూవాదులు కూడా రావణాసురుడి క్యారెక్టర్ చిత్రీకరణను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక హనుమంతుడికి గెడ్డం పెట్టడం హిందూవాదులకు అసలు నచ్చలేదు.
ఈ విమర్శల తరువాత మూవీ పై మరింత ఫోకస్ చేసిన ఓం రౌత్, ట్రైలర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. 3డీలో ట్రైలర్‌ను చూసిన ఆడియెన్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. జూన్ 16న ఈ చిత్రం 5 భాషల్లో భారీగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో బాహుబలి సినిమా తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ హీరో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ తిరుపతిలోనే నిర్వహించారు. 2015 లో జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్‌లో బాహుబలి ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
8 ఏళ్ళ తరవాత జూన్ 6న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరగనుంది. దాంతో బాహుబలి సినిమా లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాహుబలి సెంటిమెంట్ వాడుతున్నారంటే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందంటూ మీమ్స్ షికారు చేస్తున్నాయి.





పెళ్లి అనే విషయం శరత్ బాబుకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇద్దరిని అఫిషియల్ గా పెళ్లి చేసుకున్నా, సీక్రెట్‌గా వేరొకరితో కాపురం చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. శరత్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టిన సమయానికే తెలుగు ఇండస్ట్రీలో రమాప్రభ స్టార్ కమెడీయన్‌గా వెలుగొందుతున్నారు. ఆమె శరత్ బాబు కన్నా వయసులో 4 ఏళ్లు పెద్దది. అయినపట్టికి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అలా వారు 14 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెట్టడంతో విడాకులు తీసుకున్నారు. తరువాత శరత్ బాబు తమిళ యాక్టర్ నంబియార్ కుమార్తె స్నేహలతను వివాహం చేసుకున్నారు. కానీ ఆయన కొన్నాళ్లకే స్నేహలతతో కూడా విడిపోయారు. ఆ తరువాత కొంతకాలం ఒంటరిగా ఉన్న శరత్ బాబు, హీరోయిన్ నమితను రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం కొలీవుడ్, టాలీవుడ్ లో విస్తృతంగా జరిగింది.
అయితే శరత్ బాబు అప్పట్లో ఈ వార్తలను ఖండించినా ఆ రూమర్స్ ఆగలేదు. శరత్ బాబును ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు పిల్లలు లేరా అని అడిగినపుడు దానికి ఆయన తన సోదరులు, అక్కాచెల్లెల పిల్లలు అంతా కలిసి 25 మంది అని, వారంతా కూడా తన పిల్లలే అని చెప్పారు. శరత్ బాబు మరణించిన రోజు నుండే అతని బంధువులు ఆస్తుల కోసం తగాదా పడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మరో వైపు శరత్‌బాబుకు మాజీ భార్య స్నేహ నంబియార్‌తో ఇద్దరు పిల్లలు ఉన్నారని, సాయి కార్తీక్ అనే కుమారుడు, పల్లవి అనే కుమార్తె ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా కొంతమంది ఆయనకు పిల్లలు లేరని, మరి కొంతమంది పిల్లలు ఉన్నారని అంటున్నారు.








