తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు పేరు తెలియని వారు ఉండరు. అందరు ప్రేమగా ANR అని పిలుస్తారు. ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 255 చిత్రాల్లో నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు మధ్యతరగతి కుటుంబంలో 20 సెప్టెంబర్ 1923లో జన్మించారు. 10 సంవత్సరాల వయస్సులోనే థియేటర్ లో నటించటం మొదలు పెట్టారు. ఆ కాలంలో మహిళలు నటించడం నిషేధంలో ఉండేది. దాని వల్ల నాగేశ్వరరావు అమ్మాయిల పాత్రల్లో నటించేవారు. 17 ఏళ్ల వయస్సులో 1941లో తొలి సినిమా చేసాడు. ఆ సినిమా పేరు ధర్మపత్ని, ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ గా నటించారు. నాగేశ్వరరావు గారు ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉండగా అక్కడ ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య చూసి సినిమా అవకాశం ఇచ్చారు.
1949వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు 18 ఫిబ్రవరిన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అయితే నాగేశ్వరరావు తన వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ జంట తమ 78 సంవత్సరాల ప్రయాణంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో తమ వైవాహిక జీవితం ద్వారా చూపించారు. వీరికి ఐదుగురు పిల్లలు నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల.
అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. మాయాబజార్, బ్రతుకు వీధి, సంసారం, ఆరాధన, దొంగ రాముడు, అర్ధాంగి, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం, మాంగల్య బలం, శాంతినివాసం, భార్య భర్తలు, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, బాటసారి, ధర్మదాత, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ను తెలుగు సినిపరిశ్రమకి అందించారు
1970ల లో తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకు రావటంలో ముఖ్య పాత్రను పోషించారు. 1976వ సంవత్సరంలో తన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి తెలుగు సినిమాకు మౌలిక సదుపాయాలను అందించారు. అక్కినేని నాగేశ్వరరావుతెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు.



















ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.





















