టాప్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ ఎట్టకేలకి పబ్లిక్‌లోకి వచ్చింది. గత ఏడాది ‘యశోద’ మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధి నుంచి కోలుకుంటోంది. అయితే ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్న సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ కి బయటకి వచ్చింది. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సామ్ ఈ వ్యాధి కారణంగా ఆ మధ్య కాస్త స్లో అయ్యింది కానీ మళ్ళీ ఇదివరకు లాగే తిరిగి సోషల్ మీడియా లో యాక్టీవ్ గా మారింది.
నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది సామ్. అయితే తాజాగా సామ్ తన ఇన్ స్టా లో పోస్ట్ ఆసక్తి కరం గా మారింది. తన కొత్త బెస్ట్ ఫ్రెండ్ అంటూ సామ్ ఆ పోస్ట్ పెట్టింది. ఇంతకీ సామ్ న్యూఫ్రెండ్ ఎవరో తెలుసా ?.. గ్లాసెస్. మిరుమిట్లు గొలిపే వెలుగుల కాంతులలో చిరునవ్వులు చిందిస్తూ తన సెల్ఫీని షేర్ చేసింది. అందులో ఆమె కొత్త గ్లాసెస్ ధరించింది. గ్లాసెస్ నా కొత్త బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇటీవల సామ్ శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో చేతిలో జపమాల.. గ్లాసెస్ ధరించి కనిపించింది. మునుపటి కంటే సామ్ లుక్స్..ఆహార్యం పూర్తిగా మారిపోయింది. నిత్యం జపమాల, కాళ్ళ జోడు, తెల్లటి దుస్తులు సామ్ ధరిస్తోంది. దీంతో ఆమె అందం తగ్గిందంటూ కామెంట్స్ చేశారు. తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల పట్ల గట్టిగానే కౌంటరిచ్చింది సామ్. ఇక ఇటీవలే జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. మన ఆలోచనలే మన బలం అంటూ రాసుకొచ్చింది. ఆటో ఇమ్యూనిటీ.. మనం తీసుకునే ఆహారం మాత్రమే మన బలం కాదు.. మన ఆలోచనలే మనకు అసలైన బలం అంటూ సామ్ షేర్ చేసిన వీడియోవైరల్ అయ్యింది.

మరో వైపు సామ్ నటించిన శాకుంతలం చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించారు. ఇదే కాకుండా.. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివనిర్వాణ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ సిరీస్ లోనూ సామ్ కనిపించనుంది. సమంతకి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన ఫ్యామిలీమెన్-2 సిరీస్ దర్శకులే ఈ వెబ్‌సిరీస్‌కి దర్శకత్వం వహించబోతున్నారు.

అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి,ఏం చేయాలి అనే దానిపై సమీరా ఫ్యాన్స్ కి సలహాలు కూడా ఇచ్చారు. వీక్లీ 4 సార్లు యోగా, బ్యాడ్మింటన్ చేయడంతో పాటు,అప్పడప్పుడు ఉపవాసం చేస్తూ బరువు తగ్గనని తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను, తర్వాత సన్నగా అయిన ఫోటోను షేర్ చేసి ఎంతోమందికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. ఇక సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ అనుభవాల్ని వెల్లడిస్తానని ముందే ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన సమీరా, ఆ తరువాత ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ కాబోయే తల్లులకు ధైర్యాన్ని ఇస్తూ ఆదర్శంగా నిలుస్తునాన్నారు.
అంతేకాకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల అందం చెడిపోతుందని రకరకాలుగా బయట సమాజం మాట్లాడుకుంటుంది. అలా అనుకోవడం సరికాదని చెబుతోంది. గోవాలో ఉంటున్న ఆమె రోజువారీ విశేషాలు, ఆరోగ్య చిట్కాలు, వంటలు వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తున్నారు. ఇక ఈ నేచురల్ బ్యూటీ అంటూ సమీరారెడ్డి మేకప్ లేకుండా పెట్టిన డీగ్లామరస్ ఫోటోలు ఒకవైపు వైరల్ అవుతుంటే,మరోవైపు వాటికి ట్రోల్స్ కూడా వస్తున్నాయి.అయిన ట్రోల్స్ అన్నిటికీ సమీరా ధీటుగా కౌంటర్లు ఇస్తుంటారు.



















స్పైడర్ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా విలన్ గా భైరవుడు అనే క్యారెక్టర్ లో ఎస్.జె సూర్య అద్భుతంగా నటించారు.
ఈ అబ్బాయి పేరు సంజయ్. శ్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత అతన్ని ‘స్పైడర్ సంజయ్’ అని పిలుస్తున్నారు. ఈ మూవీ తరువాత సంజయ్ పలు తమిళ సినిమాలలో నటించాడు. మాగముని, జాక్ పాట్, గజినీకాంత్, ఎచ్చరిక్కై తుగ్లక్, దర్బార్ వంటి సినిమాలలో నటించాడు.
సంజయ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ పేరు కుట్టి టాకీస్. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫుడ్ రివ్యూలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోను సంజయ్ యాక్టివ్ గా ఉంటాడు. పాపులర్ సాంగ్స్ కు డాన్స్ చేసిన వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు.