రామ్ చరణ్ కి RRR సినిమా ఒక మంచి హిట్ ని ఇచ్చింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూ ఉంటే మరి కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఆ తర్వాత ఇటీవల విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా నిర్మాణ పనుల్లో కూడా రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇక RC 16 మీద ఒక అప్డేట్ వచ్చింది. RC 16 కోసం కూడా చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి యువీ క్రియేషన్స్ తో ఓ సినిమా చరణ్ చేస్తారని చెప్పారు.

కానీ RC 16 పక్కన పెట్టేశారు. అయితే తాజాగా RC 16 విషయంపై ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు అయిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం సినిమా తరహాలో RC 16 కోసం చెర్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో చెర్రీ కి కాళ్లు ఉండవట.. వీల్ చెయిర్‌లోనే వుండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం కొంతమంది అసలు ఇలాంటి స్టోరీ రామ్ చరణ్ కి సూట్ అవుతుందా? ప్రేక్షకులు రామ్ చరణ్ ని ఇలాంటి రోల్ లో చూడగలుగుతారా? అని అంటున్నారు.

RC 15 అయితే.. శంకర్ దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి అంతకు ముందు వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అలానే ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఇందులో అంజలి కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. రామ్ చరణ్, అంజలి కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటను న్యూజిలాండ్‌లో షూట్ చేస్తున్నారు. పైగా ఈ పాటకు రూ.15 కోట్లు మేరకు ఖర్చు చేస్తున్నారట.



ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వూ సోషల్ మీడియాలో షికారు చేసింది. తాజాగా 1998లో పవర్ స్టార్ ఇంటర్యూకి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. అయితే పవన్ ఈ ఇంటర్యూలో పర్సనల్ మరియు వృత్తిపరమైన విషయాల గురించి కూడా చెప్పాడు. అందులో మీ మొదటి స్నేహితురాలు ఎవరని అడిగితే ఆరోజుల్లో నాతో మాట్లాడటానికి ఏ అమ్మాయి కూడా ఆసక్తి చూపించేవారు కాదని, నాలో స్పెషల్ ఏం లేదని ఆయన తెలిపాడు. ఇంకా చెప్తూ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ అయస్కాంత ముక్కలు తెలీకుండా తీసుకున్న విషయం చెప్పాడు.
కానీ అప్పుడు చేసినదానికి ఇప్పటికీ కూడా ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అని బాధ పడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. దేవదాసు సినిమాలోని అంతా భ్రాంతియేనా సాంగ్ , దాని సాహిత్యం, ట్యూన్ అంటే చాలా ఇష్టమనీ, ఆ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ ఇంటర్వూ వచ్చిన న్యూస్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.




























