నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హిట్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్ జె సూర్య, సాయికుమార్, అదితి బాలన్ ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు. వారం అంతా కోపాన్ని ఆపుకున్న వ్యక్తి శనివారం రోజు మాత్రమే తన కోపాన్ని చూపించడానికి కారణం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా డిఫరెంట్ పాయింట్ మీద ఈ సినిమా నడిపించారు. అయితే ఈ సినిమాలో ఒక విషయం మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి.
కొన్ని విషయాలని ఇంకా వివరంగా చూపిస్తే బాగుండేది అంటూ చాలా మంది అంటున్నారు. సెకండ్ హాఫ్ లో చాలా వరకు ఎవడు సినిమా గుర్తొచ్చింది అని అంటున్నారు. మాస్ యాంగిల్ ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అని కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా మొత్తంగా బాగున్నా కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి అని అంటున్నారు. కొన్నిచోట్ల అయితే సీన్స్ మరి సాగదీసినట్టు అనిపించాయి అని అన్నారు. ఎలివేషన్స్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూసినట్టు ఉంది అని అంటున్నారు. కానీ, సినిమాకి మాత్రం మంచి టాక్ వస్తోంది. వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. దాంతో ఈ సినిమాకి టైం తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
కానీ ఈసారి మాత్రం ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటుంది. సినిమాలో ప్రతి ఒక్క పాత్రకి ప్రాముఖ్యత ఉండేలాగా రాయడం అనేది చాలా కష్టం. కానీ ఈ సినిమాలో అలాగే చేశారు. సినిమాలో నటించిన వాళ్లందరూ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. వాళ్లు స్క్రీన్ టైం ఎంత ఉన్నా కానీ, ఉన్నంత సేపు బాగా చేశారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు వాళ్ళకి వివేక్ ఆత్రేయ రాశారు. అందుకే అందరూ వివేక్ ఆత్రేయని పొగుడుతున్నారు. ఇంక నాని విషయానికి వస్తే, సరిపోదా శనివారం సినిమా తర్వాత, నాని దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాని ఇటీవల ప్రకటించారు.