ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అయితే ఇటీవల జబర్దస్త్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా ఇప్పుడు నటిగా కూడా రాణిస్తున్నారు అనసూయ. అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా యాంకర్ గా చేస్తారు అనసూయ. టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. క్షణం, రంగస్థలం సినిమాల్లో అనసూయ పోషించిన పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా అనసూయ ఎన్నో సినిమాల్లో నటించారు.
అయితే ఇదిలా ఉండగా అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనసూయ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నారు అనే వార్త నిజం ఏమో అనేలాగా ఉన్నాయి. అయితే అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి కారణం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. ఇందుకు కారణం అనసూయ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ కోసం అనసూయ చాలా డేట్స్ కేటాయించాల్సి ఉంది.
దాంతో జబర్దస్త్ షో నుండి బయటికి రావడం బెస్ట్ అని ఆ డైరెక్టర్ సూచించారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ సోని లివ్ లో మొదలవుతుంది. ఇందుకోసం అనసూయ వర్క్ షాప్ కి కూడా హాజరవుతారు. ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ పాత్రలో అనుసూయ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తారని సమాచారం. దాంతో నటనపరంగా తనని తాను ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మాత్రం ఇంకా తెలియదు.