నాచురల్ స్టార్ నాని పరిచయం అక్కర్లేని వ్యక్తి. శ్యామ్ సింఘ రాయ్ తో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దసరా సినిమాలో నటిస్తారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి. అయితే నాని సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
కొంత మంది హీరోయిన్లు నానితో సినిమా చేసిన తర్వాత ఫేమస్ అయ్యారు. కానీ వారు తర్వాత ఎక్కువ కాలం సినిమాల్లో నటించలేదు. కొంత మంది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి ఒక సినిమాలో కనిపిస్తున్నారు. అలా నాని సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం.
#1 శరణ్య మోహన్
భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శరణ్య మోహన్ తర్వాత ఒక సినిమాలో నటించారు. ఆ తరువాత తెలుగులో పెద్దగా నటించలేదు. కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

#2 రియా సుమన్
మజ్ను సినిమాలో నటించారు రియా. ఆ తరువాత పేపర్ బాయ్ సినిమాలో నటించారు.

#3 సురభి
సురభి బీరువా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత నాని హీరో నటించిన జెంటిల్ మాన్ సినిమాలో నటించారు. ఇటీవల ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శశి సినిమాలో కూడా నటించారు.

#4 హరిప్రియ
పిల్ల జమిందార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన హరిప్రియ, ఆ తర్వాత ఎన్నో కన్నడ సినిమాల్లో నటించారు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన జై సింహాలో కూడా నటించారు.

#5 రుక్సార్
కృష్ణార్జున యుద్ధంలో హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఒక సిరీస్ కూడా చేశారు. ఇటీవల అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో కూడా నటించారు.

#6 మాధవి లత
మాధవి లత నానితో కలిసి స్నేహితుడా సినిమాలో నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.

వీరిలో చాలామంది అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. కొంతమంది మాత్రమే సినిమాలకు దూరం అయ్యారు.







టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు.
ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.





















#8 సర్దార్




