ఒక స్టార్ హీరో సినిమా కి సంబంధించి ఈవెంట్ అయినా, చిన్న హీరో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే. అటు బడా ఈవెంట్ల నుంచి మొదలు కొని బుల్లితెర పై షోల వరకు సుమ కనకాల ఉంటారు. ఆమె షెడ్యూల్ లో ఒక రోజు కూడా తీరిక లేకుండా ఉంటారు.
అచ్చ తెలుగుని గడగడా మాట్లాడేసే సుమని చూస్తే.. ఎవ్వరు ఆమెను కేరళ అమ్మాయి అని అనుకోరు. కేరళ అమ్మాయి అయిన యాంకర్ సుమ రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తరువాత తెలుగు వారింటికి కోడలిగా వచ్చేసారు.
అంతే కాదు.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ తెలుగు సినిమా అభిమానులకు మరింత చేరువయ్యారు. ఇక బుల్లితెరపై ఆమె చేసే సందడిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటె.. యాంకర్ సుమకు ఓ అందమైన ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటిని చాలా సినిమాలలో షూటింగ్ కి కూడా ఉపయోగించుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేద్దాం.
#1. 100% లవ్:నాగచైతన్య, తమన్నా హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా 100% లవ్. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇంటిలోనే జరిగింది. ఆ ఇల్లు ఎవరిదో కాదు యాంకర్ సుమదే.
#2 పూల రంగడు:
సునీల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కూడా సునీల్ ఉన్న ఇల్లు యాంకర్ సుమదే కావడం గమనార్హం.
#3 బాద్ షా:
శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా బాద్ షా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ ఉన్న ఇల్లు యాంకర్ సుమదే.
#4 బ్రూస్ లీ:
రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఉంటున్నట్లు కనిపించే ఇల్లు కూడా యాంకర్ సుమదే.
#5 దూకుడు:
మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు ఓ ఇంట్లో ఉన్నట్లు చూపిస్తారు. ఆ ఇల్లు కూడా యాంకర్ సుమదే కావడం విశేషం.
యాంకర్ సుమ ఇల్లు షూటింగ్ కి అనువుగా ఉండడంతో పాటు.. అందంగా కూడా ఉండడంతో ఆమె ఇంటిని చాలా మందే షూటింగ్ ల కోసం వాడుకుంటున్నారు.




































అయినా పాయల్ కీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా “గాలి నాగేశ్వరరావు” అనే మూవీలో నటిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన అందాలను బయట పెడుతుంది.
ప్రస్తుతం ఆమె జీ మహోత్సవం కార్యక్రమంలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. తన ప్రియుడు సౌరబ్ దింగ్రతో కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అయితే ఎపిసోడ్ మాత్రం ఈ రోజు ప్రసారం కానుంది. తాజాగా దీని ఫ్రొమో బయటకు విడుదల చేశారు. 













