తెలుగు నాట బిగ్ బాస్ రియాలిటీ షో కి ఓ రేంజ్ లోనే పాపులారిటీ ఉంది. నిన్న మొన్నటి దాకా టివి లోనే సందడి చేసిన బిగ్ బాస్ యూనిట్.. తాజాగా ఓటిటిలో కూడా తన ఎంటర్టైన్మెంట్ ను విస్తరించింది. రీసెంట్ గానే ఓటిటిలో స్టార్ట్ అయిన బిగ్ బాస్ తొలి షో అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ ఓటిటి తొలి సీజన్ లో బిందు మాధవి ఫైనల్స్ కూడా నిలబడి విన్ అయ్యి.. టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ షో పై మరింత ఆసక్తి రేకెత్తుతోంది.
తొందరలోనే టివి లో బిగ్ బాస్ 6 తెలుగు షో ప్రారంభం కావాల్సి ఉంది. సాధారణంగా.. బిగ్ బాస్ షో లో ఎక్కువగా సెలెబ్రిటీలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఇప్పుడు కామన్ పీపుల్ కి కూడా అవకాశం కల్పించాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. కాగా.. ఇందుకు సంబంధించి బిగ్ బాస్ యూనిట్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులకు ఆహ్వానం పలికారు. ఇప్పటి వరకు ఇంట్లోనే ఉండి బిగ్ బాస్ షో ను ఆనందించారు. ఇప్పుడు ఈ గేమ్ లో మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు అంటూ పిలుపునిచ్చారు. అయితే బిగ్ బాస్ 6 సీజన్ కు టికెట్ పొందాలంటే.. స్టార్ మా వారి వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి అని నాగార్జున సూచించారు. ఈ సైట్ లోకి వెళ్ళాక.. పేరు, జెండర్ వివరాలు ఇవ్వాలి. పుట్టిన తేదీ, అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక మరో ఎమర్జెన్సీ నెంబర్ తో పాటు సదరు వ్యక్తి డీటెయిల్స్ ను కూడా ఇవ్వాలి. ఆ తరువాత జాబ్, లాంగ్వేజ్ గురించి తెలియ చెప్పాలి. మీ గురించి కొన్ని విషయాలను చెప్పాల్సి ఉంటుంది. ఓ మూడు నిమిషాల ఆడిషన్ వీడియోను కూడా జత చేయాలి. వీడియో సైజు 50 ఎంబి మించకుండా చూసుకోండి.







ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారట. ఇందులో కామెడీ సన్నివేశాలకు తోడుగా తమన్నా, మెహరీన్ అందాలు మరింత అట్రాక్టివ్ గా మారుతాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతుందని అనిల్ రాయపూడి బలంగా నమ్ముతున్నారు. ఇది మాత్రం హిట్టయితే దీనికి సీక్వెల్ గా మరో f4మూవీ కూడా ఉంటుందని హింట్ ఇస్తున్నారు.

దీని తర్వాత అదిరింది షో లో కొంతకాలం స్కిట్ లు చేసిన ఆర్ పి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో చేస్తున్నారు. జబర్దస్త్ మరియు ఇతర టీవీ షోలతో పోల్చిచూస్తే రెట్టింపు పారితోషికం దక్కుతుండడంతో ఈ షో మీద ఇతర స్టార్ కమెడియన్స్ కూడా ఆసక్తి కనబరచడం మనం చూస్తూనే ఉన్నాం.
అలాంటి ప్రముఖ కమెడియన్ ఓ ఇంటివాడు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి గా పేరు తెచ్చుకున్న ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్ పి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని సమాచారం.
అయితే నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి జోడిని చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు వస్తున్నాయి. అయితే పెళ్లికి సంబంధించి త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. అయితే ఈ వేడుక హైదరాబాద్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగినట్టు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోయే సలార్ మూవీ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అంతటి స్టార్ డైరెక్టర్, ఇంత స్టార్డమ్ ఉన్న హీరో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి. 
కానీ దాన్ని ఇప్పటివరకు మూవీ యూనిట్ ధృవీకరించలేదు.సలార్ చిత్రంలో ప్రభాస్, శృతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ నీ హోంబలే ఫిల్మ్ భారీ స్థాయిలో మన ముందుకు తీసుకురానుంది. మూవీ షూటింగ్ జూన్ లో ప్రారంభించనున్నారు.






