రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. తర్వాత సినిమా మార్చ్ లో విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే పాటలు విడుదల చేశారు. ఈ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమాలోని దోస్తీ వీడియో సాంగ్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాట లిరికల్ వీడియో సినిమా విడుదల అవ్వకముందే విడుదల అయ్యింది.

ఈ పాటని ఆ వీడియోలో హేమచంద్ర పాడారు. కానీ సినిమాలో మాత్రం వేరే గాయకుడు గొంతు వినిపించింది. సినిమాలో ఈ పాటని కాలభైరవ పాడారు. సినిమా విడుదల అవ్వకముందే పాట చాలా ఫేమస్ అయింది. దాంతో సినిమాలో వేరే గొంతు విన్నప్పుడు ప్రేక్షకులకి కొంచెం కొత్తగా అనిపించింది. మిగిలిన భాషల్లో మాత్రమే లిరికల్ వీడియోలో కనిపించిన గాయకులు పాడిన పాటే ఉంది. తెలుగులో మాత్రం మారింది. మరి ఇలా మార్చడానికి వెనుక కారణం ఏంటో సినిమా బృందానికి మాత్రమే తెలియాలి. ఇంక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో వర్షన్స్ జీ 5 లో విడుదల అయ్యాయి. హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో విడుదల అవుతుంది. ఈ విషయంపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.








































మరి ఎందుకు కనిపించడం లేదు అనే డౌట్ చాలామందిలో ఇప్పటికి ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని ఆలీ గారే ప్రస్తావిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమస్య చాలా మంది సీనియర్ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ దీనిపై ఆయన ఏమన్నారంటే.. ఈ మధ్య చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు.పాత్ర చాలా బాగుంటుంది అని చెబుతూ.. కథ ఏంటో కూడా చెప్పకుండా డేట్స్ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలై థియేటర్ లోకి వచ్చాక అసలు ఆలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు అనేలా మూవీస్ ఉన్నాయి.
అభిమానులతో అలా అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వస్తున్నా కథ నచ్చితేనే ఓకే చెబుతున్నానని అన్నారు. ఈటీవీ సీరియల్ లో నటించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసం యమలీల సీరియల్ చేస్తున్నానని అన్నారు.
స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశాడని, ఆయన ఏది చెప్పినా వెనకాడకుండా ఆలోచించకుండా చేస్తానని అన్నాడు ఆలీ. అందుకోసమే ఇప్పుడు యమలీల సీరియల్ చేశానని వివరించాడు. దీంతో పాటు ఇతర భాషల్లో సినీ అవకాశాల గురించి కూడా ఆలీ చెప్పుకొచ్చారు.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే నేపాలి సినిమాకు కూడా సంతకం చేశారట. ఒకప్పుడు మన తెలుగులో ఉత్తరాది వాళ్లని తీసుకువచ్చి నటన, భాషను నేర్పించి మరి దర్శకనిర్మాతలు డబ్బులు ఇచ్చేవారు.
కానీ ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీ వాళ్లే మనల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే మేం ఇండియన్ స్టార్స్ గా మారిపోయామంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే నేపాల్ సినిమా వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.
